Skill Development Courses : ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు.. ఈ తేదీల్లోనే..
తిరుపతి: తిరుపతి కేటీ రోడ్డులోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సెప్టెంబర్ 2 నుంచి 6 విభాగాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ వై.ద్వారకనాథరెడ్డి తెలిపారు. ఇందులో ఎలక్ట్రికల్ క్యాడ్, ప్రోగ్రామబుల్ లాజికల్ కంట్రోల్ (పీఎల్‌సీ), సాలిడ్ ఎడ్జ్, కంప్యూటర్ న్యూమ రికల్ కంట్రోల్ ప్రోగ్రామింగ్(సీఎన్‌ఎల్‌పి), రివీట్ ఆర్కిటెక్చర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
New Medical Colleges : కొత్త వైద్య కళాశాలల నిధుల విషయం తేలాకే పీపీపీపై ముందడుగు!
ఈ కోర్సులు డిప్లమో, ఐటీఐ, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు స్కిల్స్ ను పెంపొందించుకునేందుకు దోహదపడతాయని తెలిపారు. 90 గంటల కాలవ్యవధితో శిక్షణ ఇచ్చే ఈ కోర్సులకు ఒక్కోదానికి రూ.1,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వారికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి సాంకేతిక విద్యాశాఖ సర్టిఫికెట్లను అందజేస్తుందని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఐఆర్‌జీ ల్యాబ్ ఇన్‌చార్జ్ కమల్‌ను 99851 29995లో సంప్రదించాలని కోరారు.
Tags
- Skill Development Courses
- Govt Polytechnic Colleges
- students education
- Employment opportunity
- AP government
- sept 2nd
- Polytechnic college principal dwarakanath reddy
- diploma and iti students
- Intermediate Students
- Department of Technical Education
- Employment Courses
- Education News
- Sakshi Education News
- SVGovernmentPolytechnicCollege
- SkillDevelopmentTirupati
- ElectricalCAD
- PLCTraining
- SolidEdgeCourse
- CNLPProgramming
- RevitArchitecture
- IoTCourses
- Tirupati
- SkillCourses
- SakshiEducationUpdates