AP NIT: ఇన్ చార్జి డైరెక్టర్‌గా ప్రమోద్ పడోలే
Sakshi Education
ఏపీ నిట్ ఇన్ చార్జి డైరెక్టర్‌గా నాగపూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీనిట్) డైరెక్టర్ ప్రమోద్ పడోలే నియమితులయ్యారు.
ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఏప్రిల్ తొమ్మిదోతేదీ ఆదేశాలు జారీచేసింది. ఈ బాధ్యతలు చేపట్టేందుకు ఆయన ఏప్రిల్ 11న ఆమోదం (కన్సెంట్) తెలిపారు. పడోలే ఏప్రిల్ 12న లేదా 13న వర్చువల్‌గా ఏపీ నిట్ బాధ్యతలను చేపట్టనున్నారు. ఆయన 2018 జూన్ నుంచి నాగపూర్ వీనిట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రాథమిక విద్య బండారాలోని లాల్‌బహదూర్ శాస్త్రి హైసూ్కల్‌లో, మెకానికల్ ఇంజనీరింగ్‌ను వీనిట్ నాగపూర్‌లో అభ్యసించిన పడోలే అదే నిట్‌కు డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బెటర్ ఇన్ స్టిట్యూట్, ఇండస్ట్రీ ఇంటరాక్షన్, ఇంటర్నల్ డిసిప్లినరీ రీసెర్చ్, ఇంటర్నల్ రెవెన్యూ జనరేషన్ లక్ష్యాలుగా కలిగిన పడోలేను ఏపీ నిట్ ఇన్ చార్జి డైరెక్టర్‌గా కేంద్ర విద్యాశాఖ నియమించింది.
చదవండి:
Published date : 12 Apr 2022 01:27PM