AP NIT: పీహెచ్‌డీకి దరఖాస్తుల ఆహ్వానం

బయో టెక్నాలజీ, కెమికల్, సివిల్, సీఎస్‌ఈ, ఎలక్ట్రికల్, ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మ్యాథ్స్, స్కూల్ ఆఫ్ సైన్సెస్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇంగ్లి‹Ùలలో పీహెచ్‌డీని ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్‌గా చేసుకోవచ్చు. దీని కోసం దరఖాస్తులను ఆన్ లైన్ లో జూన్ 13లోగా చేసుకోవాలి. టెస్టు లేదా ఇంటర్వూ్య రూపంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పీహెచ్‌డీ రెగ్యులర్‌లో 6 సెమిస్టర్లను 3 అకడమిక్ సంవత్సరాలలో పూర్తి చేయాలి. పార్ట్‌టైమ్ పీహెచ్‌డీని 8 సెమిస్టర్లలో 4 అకడమిక్ సంవత్సరాల్లో పూర్తి చేయాలి. ఎంఎస్ బై రీసెర్చ్‌ను 4 సెమిస్టర్లలో 2 అకడమిక్ సంవత్సరాల్లో పూర్తి చేయాలి. పీహెచ్‌డీ ఫుల్‌టైమ్ కోసం 27 సీట్లు, పార్ట్‌టైమ్ కోసం 30సీట్లు, ఎంఎస్ బైరీసెర్చ్ కోసం 20సీట్లు ఉన్నాయని ఏపీ నిట్ అధికారులు వెల్లడించారు.
