Engineering College: సాంకేతిక అభివృద్ధికి అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకంగా నిలుస్తుంది
విజయనగరం అర్బన్: పరిశోధన రంగంలో వస్తున్న ఆధునికతకు అనువైన నూతన కోర్సులను నేర్చుకుని నైపుణ్యం మెరుగుపరచుకోవాలని జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) యూనివర్సి వీసీ ప్రొఫెసర్ కె.వెంకటసుబ్బయ్య అన్నారు. ఈ మేరకు స్థానిక ఇంజినీరింగ్ కళాశాల ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో రెండురోజులపాటు నిర్వహించే జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు.
Intermediate Courses: అందుబాటులోకి ఇంటర్మీడియట్ కోర్సులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్య స్థాయిలోనే సంబంధిత విద్యతోపాటు ఉద్యోగ, ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అందుకు సంబంధించిన ఇలాంటి సదస్సులలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన విశాఖ స్టీల్ ప్లాంట్ జీఎం (డీఈఅండ్‌ఈఏ) కె.వాణిశ్రీ మాట్లాడుతూ రానున్న సాంకేతిక అభివృద్ధికి అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకంగా నిలుస్తుందన్నారు. అందుకు అవసరమైన మానవ శక్తి డిమాండ్‌ను నేటి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
AP Tenth Exams: టెన్త్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష..
వార్షిక సావనీర్‌ను వీసీ ప్రొఫెసర్ వెంకటసుబ్బయ్య ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యఅతిథిని ఘనంగా సత్కరించారు. ఈఈఈ విభాగాధిపతి డాక్టర్ ఎ.పద్మజ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.శ్రీకుమార్, సదస్సు కన్వీనర్ డాక్టర్ వీఎస్.వకుళ, ఫాకల్టీ కోఆర్డినేటర్స్ పి.శ్రీనివాసరెడ్డి, టి.శిరీష, విద్యార్థి కో ఆర్డినేటర్ వి.దయాకర్, రాము, డి.విజయశ్రీ, పి.కల్యాణి, వివిధ కళాశాలల నుంచి 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు.