JEE Main 2nd Session : జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షపై ఎన్‌టీ ప్రకటన.. నేటినుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేషన్: ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఐఐటీ, ఎన్ఐటీ వంటి ఉన్నత కళాశాలల్లో ఇంజినీరింగ్ సీట్లు పొందాలంటే జేఈఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. అయితే, ఇప్పటికే, జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు ముగిశాయి. త్వరలో ప్రిలిమినరీ కీ కూడా విడుదల కానుంది. కాగా, ఇక రెండో సెషన్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఎన్‌టీఏ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది.
జేఈఈ మెయిన్ రెండో సెషన్
బీటెక్ ప్రవేశాలకు రాయాల్సిన జేఈఈ పరీక్షకు సంబంధించి రెండో సెషన్ పరీక్షల నోటిఫికేషన్‌ను ఎన్‌టీఏ తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. దీని కోసం నేటి నుంచి అంటే, జనవరి 31వ తేదీ నుంచే విద్యార్థులు రిజిస్ట్రేషన్‌లు చేసుకోవచ్చని సూచించింది.
JEE Main Question Paper Analysis : జేఈఈ ప్రశ్న పత్రాల విశ్లేషణ.. పేపర్లు ఎలా వచ్చాయంటే..!!
ఇక ఈ ప్రక్రియ వచ్చే నెల ఫిబ్రవరి 24వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని తెలిపింది. విద్యార్థులు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/లో ప్రకటించిన రిజిస్ట్రేషన్ లింక్‌లో అడిగిన పూర్తి వివరాలను నమోదు చేయాలని పేర్కొంది.
పరీక్షల తేదీ.. వివరాలు..
జేఈఈ మెయిన్ సెషన్ 2 కు దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలు రోజుకు రెండు షిఫ్టుల్లో జరుగుతాయి. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక షిఫ్ట్ అయితే, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో షిఫ్ట్ ఉండనుంది. ఇలా రెండు షిఫ్ట్‌లలో రెండో సెషన్ పరీక్షలను నిర్వహించనుంది ఎన్‌టీఏ.
JEE Main 2025 Hall Tickets : జేఈఈ మెయిన్ 2025.. ఈ మూడు తేదీల హాల్‌టికెట్లు విడుదల..
ఎంపిక విధానం
విద్యార్థులు జేఈఈ మెయిన్ రెండు విడతల్లో వారు పొందే ఉత్తీర్ణత ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు. మెయిన్ పరీక్షలో కనీస మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని ఆడ్వాన్స్‌డ్ పరీక్షకు ఎంపిక చేస్తారు. జేఈఈ అడ్వాన్సడ్ 2025 మే 18న ఉంటుంది.
జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలకు దేశ వ్యాప్తంగా 14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా, సెషన్-2 పరీక్షలకు విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- JEE Main 2025
- Entrance Exam
- jee main exam 2025
- BTech Admissions 2025
- Engineering entrance exams
- jee main second session exams
- jee main session 2 notification
- registration details for jee main session 2
- National Testing Agency
- national level entrance exam
- january 31st
- second session of jee main 2025
- jee main session 1 and 2 dates
- jee main session 2 exam dates and details
- jee main 2025 session 2 exam dates
- Education News
- Sakshi Education News