Skip to main content

JEE Main 2025 Hall Tickets : జేఈఈ మెయిన్ 2025.. ఈ మూడు తేదీల హాల్‌టికెట్లు విడుద‌ల..

జ‌న‌వరి 20వ తేదీన దేశ‌వ్యాప్తంగా జేఈఈ మెయిన్ ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి.
Last three days hall tickets for jee main 2025 released  NTA releases hall tickets for January 27, 28, 29 JEE Main exams

సాక్షి ఎడ్యుకేష‌న్: జ‌న‌వరి 20వ తేదీన దేశ‌వ్యాప్తంగా జేఈఈ మెయిన్ ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. అయితే, ప‌రీక్ష‌ తేదీవారిగా హాల్‌టికెట్ల‌ను విడుద‌ల చేస్తామ‌ని ఎన్‌టీఏ ప్రారంభంలోనే ప్ర‌క‌టించింది. ఇప్ప‌టివ‌ర‌కు ఇలాగే ప్ర‌క‌టిస్తూవ‌చ్చింది. కాని, నేడు అంటే, జ‌న‌వ‌రి 24వ తేదీన చివ‌రి మూడు తేదీల ప‌రీక్ష‌లకు సంబంధించి, అంటే.. జ‌నవ‌రి 27,28,29 ఈ మూడు తేదీల హాల్‌టికెట్ల‌ను ఎన్‌టీఏ త‌మ అధికారిక వెబ్‌సైట్‌లో విడుద‌ల చేసింది. ఈ నేప‌థ్యంలో విద్యార్థులు త‌మ ప‌రీక్ష‌ల తేదీల‌వారిగా త‌మ హాల్‌టికెట్ల‌ను వెబ్‌సైట్ https://www.nta.ac.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని వివ‌రించింది.

No Entry : ఆల‌స్యం కావ‌డంతో నో ఎంట్రీ.. విద్యార్థులకు హెచ్చ‌రిక‌..!!

ప‌రీక్ష‌లివే..

జేఈఈ మెయిన్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ప్ర‌కారం, జ‌న‌వ‌రి 22వ తేదీన ప‌రీక్ష‌లు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు విడుద‌ల చేసిన హాల్‌టికెట్లు జనవరి 28, 29 తేదీల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. ఇక జనవరి 30న పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్ 2బీ (బీ ప్లానింగ్), పేపర్ 2ఏ, 2బీ (బీఆర్క్, బీ ప్లానింగ్ రెండింటికి) పరీక్ష జ‌ర‌గ‌నున్నారు.

పేపర్-1(బీటెక్, బీఈ) పరీక్ష

బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పేపర్ను మొత్తం 75 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్-25 మార్కులు, ఫిజిక్స్-25 మార్కులు, కెమిస్ట్రీ-25 మార్కులకు ఉంటుంది. ప్రతి సబ్జెక్టును రెండు విభాగాలు(సెక్షన్-ఎ, సెక్షన్-బి)గా విభజించారు. ఒక్కో సబ్జెక్టులో సెక్షన్-ఎ 20 మార్కులు, సెక్షన్-బి 5 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-ఎలో పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నల(ఎంసీక్యూలతో) రూపంలో ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్-బిలో న్యూమరికల్ వాల్యూ ఆధారిత రూపంలో అయిదు ప్రశ్నలు అడుగుతారు.

JEE Mains 2025: జేఈఈ మెయిన్ 2025 జనవరి 23వ తేదీ ఉదయం షిఫ్ట్ విశ్లేషణ

పేపర్-2(ఎ) బీఆర్క్ పరీక్ష

నిట్లు,ట్రిపుల్ ఐటీలు,ఇతర ఇన్స్టిట్యూట్లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రాయాల్సిన పరీక్ష ఇది. పేపర్-2ఎగా పిలిచే ఈ పరీక్షను కూడా మూడు విభాగాలుగా నిర్వహిస్తారు. మొత్తం 77 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 02 మార్కులు ఉంటాయి.

పేపర్-2(బి)బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ పరీక్ష..

బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పేపర్-2బి మూడు విభాగాలుగా ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ (పార్ట్-1) 25 మార్కులు, ఆప్టిట్యూడ్ టెస్ట్ (పార్ట్-2) 50 మార్కులు, డ్రాయింగ్ (పార్ట్-3) 25 మార్కులు ఉంటాయి.

JEE Main 2025 Exam: జేఈఈ–మెయిన్‌ తొలిరోజు పరీక్షలపై నిపుణుల విశ్లేషణ

స‌మ‌యానుసారం..

జనవరి 30న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఆయా తేదీల్లో మొదటి షిఫ్ట్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి సెకండ్ షిఫ్ట్ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరుగుతాయి. ఇక జనవరి 31 తేదీన సెకండ్ షిఫ్ట్లో బీఆర్క్, బీ ప్లానింగ్ పేపర్ 2ఏ, 2బీ పరీక్షలు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరుగుతాయి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Jan 2025 03:57PM

Photo Stories