Intermediate Courses: అందుబాటులోకి ఇంటర్మీడియట్ కోర్సులు
పార్వతీపురం మన్యం:
వచ్చే విద్యాసంత్సరం నుంచే అమలు
జిల్లాలో 7 ఉన్నత పాఠశాలలకు కో–ఎడ్యుకేషన్ హైస్కూల్ ప్లస్‌గా స్థాయి పెరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ 14ను విడుదల చేసింది. 2024–25 జూన్ 1 నుంచి ఇంటర్మీడియట్ తరగతులు నిర్వహించనున్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ గ్రూపుల్లో 40 చొప్పున సీట్లు కేటాయించారు. దీనికి సంబంధించిన ప్రవేశ ప్రకటన త్వరలో వస్తోంది.
–ఎన్.ప్రేమకుమార్, డీఈఓ
పేద ప్రజలకు ఇంటర్‌మీడియట్ కోర్సులను అందుబాటులో ఉంచాలనే లక్ష్యం అమలులో భాగంగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. రెండేళ్ల క్రితం జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలను హైస్కూల్ ప్లస్‌గా స్థాయి పెంచి అమలు చేసింది. రెండేళ్ల తరువాత తాజాగా మరో ఏడు పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా స్థాయి పెంచి విస్తరించింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ నంబర్ 14 విడుదల చేసి రానున్న విద్యాసంవత్సరానికి ఆయా స్కూళ్లలో ఇంటర్‌మీడియట్ కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశాలిచ్చింది.
ప్రస్తుతం జూనియర్ ఇంటర్మీడియట్ కళాశాలలు ఉన్న మండలాలలో కాకుండా మిగిలిన మండలాలల్లో ఒక్కో ఉన్నత పాఠశాలలో ఇంటర్‌మీడియట్ కోర్సులను ప్రవేశపెట్టి ఆయా ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా స్థాయి పెంచింది. ఇప్పటికే జిల్లాలోని అన్ని కేజీబీవీలలో ఇంటర్‌మీడియట్ కోర్సులు ప్రవేశపెట్టారు. అయితే, అవి పూర్తిగా బాలికలకు మాత్రమే కావడం వల్ల వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. విధిగా కో–ఎడ్యుకేషన్ కళాశాలలుండాలని కేజీబీవీలున్నప్పటికీ ఆ మండలంలో జూనియర్ కళాశాల లేకపోతే అక్కడ హైస్కూల్ ప్లస్ ఏర్పాటు చేశారు.
AP Tenth Exams: టెన్త్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష..
దీంతో అన్ని మండలాల్లో కో–ఎడ్యుకేషన్ ఇంటర్‌మీడియట్ ఉన్నట్లయింది. జిల్లాలోని 27 మండలాల్లో 17 మండలాల్లో మాత్రమే కో–ఎడ్యుకేషన్ ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. రాజాంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలతోపాటు బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండడంలో లెక్కప్రకారం 16 మండలాలకే జూనియర్ కళాశాలలు ఉన్నాయి. దీంతో ఇంకా 12 మండలాల్లో ఇంటర్‌మీడియట్ కోర్సుల కళాశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ మండలాల్లో ప్రత్యామ్నాయంగా హైస్కూల్ ప్లస్‌లను ఏర్పాటు చేయాలని భావించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రెండేళ్ల క్రితం తొలుత ఎస్‌కోట మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను హైస్కూల్ ప్లస్‌గా స్థాయి పెంచారు.
Bank Jobs 2024: బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
స్థాయి పెరగనున్న స్కూళ్లు ఇవే
జిల్లాలో ఇంటర్‌మీడియట్ కోర్సులను ఏర్పాటు చేసే హైస్కూల్ ప్లస్‌లుగా ఏడు ఉన్నత పాఠశాలలను మారుస్తారు. వాటిలో బొబ్బిలి మండలంలోని పిరిడి, బొండపల్లి, గరివిడి మండలంలోని కోనూరు, గుర్ల మండలంలోని తెట్టంగి, జామి, రామభద్రపురం, ఆర్‌ఆమదాల వలస మండంలలోని వెంకటాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
Free Service for Students: టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణ అవకాశం..!