Skip to main content

Free Service for Students: టెన్త్‌ విద్యార్థులకు ఉచిత ప్రయాణ అవకాశం..!

పదో తరగతి విద్యార్థులు తమ పరీక్ష కేంద్రానికి చేరుకునే మార్గంలో ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం వారికి ఈ విధమైన అవకాశాన్ని కల్పిస్తుంది..
AP government provides free bus services for tenth class students

రాజంపేట: పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్ధులకు ఉచిత ప్రయాణం అవకాశాన్ని ప్రభుత్వం ఈ ఏడాది కూడా కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యావ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

Mega Job Mela: రేపు మెగా జాబ్‌మేళా.. 100 కంపెనీలు.. 4 వేల ఉద్యోగాలు

కార్పొరేట్‌ విద్యను తలదన్నేలా ప్రభుత్వం నాడు–నేడుతో స్కూళ్ల ఆధునికీకరణ, ఇంగ్లీషుబోధన, డ్రస్‌కోడ్‌, విద్యాసామగ్రి, మధ్యాహ్న భోజనం, కంటివెలుగు తదితర కార్యక్రమాలతో విద్యార్ధుల ఉన్నతికి ఉన్నతంగానే అడుగులు వేసింది. ఈ క్రమంలో టెన్త్‌ పరీక్ష విద్యార్థులు హాల్‌టికెట్‌తో బస్సులో సురక్షితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చని ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆర్టీసీ అధికారులు ఆదిశగా చర్యలు తీసుకున్నారు.

TS Inter Board Begins: ఇంటర్‌ విద్యార్థులకు బోర్డు పరీక్షలు మొదలు.. ఈ సూచనలను అనుసరించండి..

Published date : 27 Feb 2024 03:49PM

Photo Stories