AP Tenth Exams: టెన్త్ పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష..
భీమవరం: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో టెన్త్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని, రెగ్యులర్ విద్యార్థులు 21,341 మంది, గత పరీక్షల్లో తప్పిన 6,085 మంది హాజరుకానున్నారన్నారు. అలాగే, ఓపెన్ స్కూల్ ద్వారా నిర్వహించే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియెట్ పరీక్షలకు 2,887 మంది హాజరుకానున్నారని చెప్పారు.
Free Service for Students: టెన్త్ విద్యార్థులకు ఉచిత ప్రయాణ అవకాశం..!
అలాగే టెట్, ఇంటర్మీడియెట్ పరీక్షలు కూడా జరుగనున్నాయని, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలన్నారు. జేసీ ఎస్.రామసుందర్‌రెడ్డి, ఇన్‌చార్జ్ డీఆర్వో బి.శివనారాయణరెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కానాల సంగీత్ మాధుర్, డీఈఓ వెంకటరమణ పాల్గొన్నారు.