Skip to main content

Union Budget 2022: వీరికి పండగే.. వీరికి మాత్రం తీవ్ర నిరాశే..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌-2022ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సారి బడ్జెట్‌ మూలధన వ్యయాన్ని 35. 4 శాతం మేర పెంచారు.
nirmala sitharaman
union budget 2022-23

వృద్ధి ప్రణాళికలకు మద్దతుగా ఆర్థిక వ్యవస్థ వార్షిక వ్యయం పరిమాణాన్ని రూ. 39.5 ట్రిలియన్‌కు (529 బిలియన్‌ డాలర్లు) పెంచాలని సీతారామన్ ప్రతిపాదించారు. ఇదిలా ఉండగా బడ్జెట్‌-2022 ప్రకటనలు పలు రంగాలకు బూస్ట్‌ను కల్పించగా..మిగతా వారికి నిరాశనే మిగిల్చింది. 

వీరికి పండగే..!
ఈవీ బ్యాటరీ మేకర్స్ : 
క్లీన్ ట్రాన్స్‌పోర్ట్ టెక్నాలజీని ప్రోత్సహించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌-2022లో  ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త స్వాపింగ్ విధానాలను ప్రవేశ పెడతామని తెలిపారు.ఈ నిర్ణయం దేశంలోని బ్యాటరీ తయారీదారులు లాభం పొందనున్నారు. 

రవాణా, మౌలిక సదుపాయాలు :
మూడు సంవత్సరాలలో రిమోట్ రోడ్లు, నగరాల్లో సామూహిక రవాణా, 400 కొత్త “వందే భారత్” రైళ్ల ప్రకటనతో  ఎల్‌&టీ లిమిటెడ్, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, కేఎన్‌ఆర్‌ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్, కంటైనర్‌తో సహా కీలకమైన మౌలిక సదుపాయాల సంస్థలకు ప్రయోజనం చేకూరనున్నాయి. వారితో పాటుగా  కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఆల్కార్గో లాజిస్టిక్స్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌ లబ్ధి చేకూరనుంది.  

మెటల్‌ రంగం :
38 మిలియన్ల ఇళ్లకు పైప్‌డ్ వాటర్ కోసం 600 బిలియన్ రూపాయల కేటాయింపులను ప్రభుత్వం ప్రకటించింది. దాంతో పాటుగా లాజిస్టిక్స్‌పై భారీగా ఖర్చు చేయడం వల్ల భారత్‌లోని లోహాల ఉత్పత్తిదారులైన వేదాంత లిమిటెడ్, టాటా స్టీల్ లిమిటెడ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్, జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్, పైప్‌మేకర్స్ జైన్ ఇరిగేషన్ లిమిటెడ్, కెఎస్‌బి ఇరిగేషన్ సిస్టమ్స్. ., కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్‌ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.

సోలార్‌ రంగం : 
స్థానికంగా సోలార్‌ మాడ్యూళ్ల తయారీని పెంచడానికి 195 బిలియన్ రూపాయల విలువైన ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహకాలను బడ్జెట్‌-2022 ప్రస్తావించారు. దీంతో టాటా పవర్ లిమిటెడ్, సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో సహా ప్రముఖ ప్యానెల్ తయారీదారుల వృద్ధిపై దృష్టి సారించనున్నాయి.

సిమెంట్, నిర్మాణ రంగం : 
నగరాల్లోని తక్కువ-ఆదాయ కుటుంబాల కోసం మరిన్ని గృహాలను నిర్మించాలనే ప్రభుత్వ ప్రణాళికతో సిమెంట్, నిర్మాణ సంస్థలైన అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, బిర్లా కార్పొరేషన్, ఏసీసీ లిమిటెడ్‌లకు మరిన్ని కాంట్రాక్ట్సు వచ్చే అవకాశం ఉంది.

టెల్కోలు, డేటా సెంటర్లు :
2022లో 5G స్పెక్ర్టమ్‌ వేలం ప్రారంభిస్తారనే నిర్ణయం టెల్కో రంగాన్నిమద్దతుగా నిలవనుంది.భారతీ ఎయిర్‌టెల్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సిఎల్ లిమిటెడ్ వంటి కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. 

డిఫెన్స్‌ పరికరాల తయారీదారులు : 
వార్షిక బడ్జెట్‌లో సెక్టార్ క్యాపెక్స్‌లో 68 శాతం స్థానిక కంపెనీలకు కేటాయించాలనే సీతారామన్ ప్లాన్‌తో రక్షణ పరికరాలను తయారు చేసే కంపెనీలు భారీగా లాభపడే అవకాశం ఉంది. ఎల్‌&టీ లిమిటెడ్., భారత్ ఫోర్జ్ లిమిటెడ్, పారాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గెయినర్స్‌గా ఉన్నాయి. డ్రోన్ స్టార్టప్‌లలో జ్యూస్ న్యూమెరిక్స్, న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ , బాట్‌ల్యాబ్ డైనమిక్స్‌కు ప్రయోజనాలు పొందనున్నాయి.

వీరికి నిరాశే..!
ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకులు : 
డిజిటల్ కరెన్సీని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోన్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.  వర్చువల్ ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్‌ల వైపు ప్రపంచ తరలింపునకు అనుగుణంగా దేశంలో సాంప్రదాయ బ్యాంకింగ్ నియమాలు మారే అవకాశం ఉంది. ఈ చర్యతో దేశంలోని ప్రాచీన రుణదాతలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్‌కు ప్రభావితం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

క్రిప్టో కంపెనీలు : 
క్రిప్టోకరెన్సీలు, నాన్-ఫంజిబుల్ టోకెన్‌లతో సహా డిజిటల్ అసెట్ లావాదేవీల నుంచి వచ్చే లాభాలపై 30 శాతం పన్ను విధించాలనే నిర్ణయంతో క్రిప్టో కంపెనీలకు తక్కువ లాభదాయకంగా మారే అవకాశం లేకపోలేదు. ఇది క్రిప్టో ఎక్స్ఛేంజీలను కూడా ప్రభావితం చేయనుంది. WazirX, Zebpay, CoinDCX, కాయిన్‌ స్విచ్‌ కుబెర్ వంటి క్రిప్టో ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ను భారీగా ప్రభావితం చేయనున్నాయి. 

కోల్‌, థర్మల్ పవర్ : 
గ్రీన్‌ఎనర్జీ, సోలార్ పవర్ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఈ రంగంలో భారీ ప్రోత్సాహకాలను అందిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. దీంతో కోల్ ఇండియా లిమిటెడ్. సింగరేణి కాలరీస్ కో., అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌ లాంటి కోల్‌, థర్మల్‌ ఆధారిత కంపెనీలపై తీవ్ర ప్రభావాలను చూపే అవకాశం లేకపోలేదు. 

స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీలు : 
మెటల్ ధరల పెరుగుదల కారణంగా స్టెయిన్‌లెస్ స్టీల్, కోటెడ్ స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తులు, అల్లాయ్ స్టీల్ బార్‌లు , హై-స్పీడ్ స్టీల్‌పై కొన్ని యాంటీ-డంపింగ్, కౌంటర్‌వైలింగ్ డ్యూటీలను ఉపసంహరించుకోవాలని కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేసింది. దీంతో జిందాల్ స్టెయిన్‌లెస్ లిమిటెడ్,  టాటా మెటాలిక్స్ లిమిటెడ్‌లపై ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఆటోమొబైల్ తయారీదారులు : 
గ్లోబల్ సెమీకండక్టర్ కొరతతో ఆటోమొబైల్‌ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత ఆటోమొబైల్‌ సెక్టార్‌లో నిరుత్సాహకరమైన వాతావరణం నెలకొంది.

Union Budget 2022 Highlights: కేంద్ర బడ్జెట్‌ 2022 ముఖ్య‌మైన అంశాలు ఇవే..

Good News: ట్యాక్స్ క‌ట్టేవాళ్ల‌కు వరాల జ‌ల్లులు ఇవే..

Nirmala Sitharaman : ఈ విద్య కోసం 200 ఛానెల్స్‌.. త్వ‌ర‌లోనే 5జీ..

Union Budget 2022-23: ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉ‍ద్యోగాలు..ప్రణాళిక ఇలా union budget

Union Budget 2022 Live Updates: వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్‌ రైళ్లు

Union Budget History and Facts: మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?

Union Budget Speech: బడ్జెట్ - సందేహాలు

Union Budget 2022 Live Updates: నిర్మలా సీతారామన్‌ అరుదైన ఘనత.. తొలి మహిళగా రికార్డు

Union Budget 2022 : ఈ రాష్ట్రాల‌పైనే కేంద్రం ఫోకస్‌..!

Nirmala Sitharaman: ఇక‌పై డిజిటల్ పాస్‌పోర్ట్‌లు.. భద్రత విషయంలో..

Parliament Budget Session 2022: లోక్‌సభలో 2021–2022 ఆర్థిక సర్వే

Union Budget 2022: నిర్మలా సీతారామన్ చేతి సంచీలో ఏం ఉండబోతోంది..? ఏం ఉంటే బాగుంటుంది..?

Union Budget-2022 Updates: యువతకు భారీగా ఉద్యోగాల కల్పన.. జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి..

Work From Home: ఉద్యోగులకు ఈసారి బడ్జెట్‌లో భారీ బెనిఫిట్స్‌..!

Union Budget 2022 Expectations: కోటీ ఆశ‌ల‌తో కోట్ల రూపాయ‌లు.. నిర్మలమ్మా బడ్జెట్ ఆశలన్నీ వీరి పైనే..!

Union Budget 2022: తగ్గే.. పెరిగే వస్తువులు ఇవే..!

Published date : 01 Feb 2022 07:12PM

Photo Stories