Skip to main content

Union Budget-2022 Updates: యువతకు భారీగా ఉద్యోగాల కల్పన.. జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి..

పార్లమెంట్‌లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులకు స్వాతంత్ర్య, అమృతోత్సవ్‌ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై భారత్‌ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.
Ram Nath Kovind,  President of India
Ram Nath Kovind, President of India

► 7 మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లతో యువతకు భారీగా ఉద్యోగాల కల్పన చేసినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ తెలిపారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లో 19 బీటెక్‌ కాలేజీల్లో 6 స్థానిక భాషలలో బోధన జరుగుందని రామ్‌నాథ్‌ పేర్కొన్నారు.

► భారత్‌ గ్లోబల్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా మారుతోందన్నారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. భారీగా వస్తున్న ఎఫ్‌డీఐలు దేశ అభివృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. మేకిన్‌ ఇండియాతో మొబైల్‌ పరిశ్రమ వృద్ధి చెందుతోందన్నారు.

► ఫసల్‌ బీమాతో సన్నకారు రైతులకు ప్రయోజం లభిస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈల చేయూత కోసం 3 లక్షల కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు.


➤ పీఎమ్‌గ్రామీణ సడక్‌ యోజనలతో రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ తెలిపారు.

➤ ప్రస్తుతం భారతదేశం మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్టపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏడాది కాలంలో 160 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశం మూడో దశ కోవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు.

➤ భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్‌ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ప్రపంచానికి భారత్‌ ఆదర్శంగా నిలిచిందన్నారు. కోవిడ్‌ ఎదుర్కోవడానికి దేశ ఫార్మారంగం ఎంతో కృషి చేసిందన్నారు. ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 

➤ పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఆయుష్మాన్‌ భారత్‌  పథకం ఎంతో ఉపయోగపడిందన్నారు. డబ్ల్యూహెచ్‌వో తొలి ట్రెడిషనల్‌ మెడిసిన్‌ సెంటర్‌ భారత్‌లో ఏర్పాటు కాబోతుందని పేర్కొన్నారు. అదే విధంగా పద్మపురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లినట్లు వివరించారు.

➤ ప్రధాని గరీబ్‌యోజన పథకం ద్వారా 19 నెలల పాటు పేదలకు ఉచితంగా రేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో భారత్‌  అతిపెద్ద ఆహార సరఫరా సంస్థ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో పేర్కొన్నారు.

Union Budget 2022 Expectations: కోటీ ఆశ‌ల‌తో కోట్ల రూపాయ‌లు.. నిర్మలమ్మా బడ్జెట్ ఆశలన్నీ వీరి పైనే..!

Work From Home: ఉద్యోగులకు ఈసారి బడ్జెట్‌లో భారీ బెనిఫిట్స్‌..!

Published date : 31 Jan 2022 01:09PM

Photo Stories