Skip to main content

What is Bound down: ‘బౌండ్‌డౌన్‌’ అంటే ఏమిటి? దీన్ని ఉల్లంఘిస్తే ఏం జ‌రుగుతుంది

ఇప్పటి వరకు బైండోవర్‌ అంటే అందరికీ తెలుసు. బౌండ్‌డౌన్‌ అంటే చాలా మందికి తెలియదు. బైండోవర్‌ అంటే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని తహసీల్దార్‌ ఎదుట హాజరుపరిచి ఒప్పందం కుదుర్చుకుంటారు.

అవసరమైతే ఒకరి పూచికత్తు తీసుకుని బాండ్‌ పేపర్‌ రాయించుకుంటారు. బాండ్‌ పేపర్‌లో పేర్కొన్న జరిమానా చెల్లించకుంటే పూచికత్తు ఇచ్చిన వారి నుంచి వసూలు చేసే వీలుంది. దీనినే బైండోవర్‌ చేయడం అంటారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాదు.. పండుగల సందర్భంలోనూ బైండోవర్‌ చేస్తుంటారు.

Voting Ink History: పోలింగ్ బూత్‌లలో వాడే 'సిరా' చ‌రిత్ర‌..!

వర్తింపు ఇలా...

బైండోవర్‌ సమయంలో ఇచ్చిన మాటను అతిక్రమించడమే బౌండ్‌డౌన్‌. వ్యక్తిగతంగా హాజరై రాతపూర్వకంగా ఇచ్చిన హామీని మితిమిరడం అంటే చట్టాన్ని ఉల్లంఘించడమే. అయితే ఇది క్రిమినల్‌ కేసు కాదు. పోలీసులకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే అవకాశం లేకపోయినా ఈ విషయాన్ని తహసీల్దార్‌కు నివేదించవచ్చు. వాటికి అనుగుణంగా ఆ అధికారి చర్యలు తీసుకోవచ్చు. బైండోవర్‌ అయిన వ్యక్తి శిక్ష తప్పించుకునేందుకు పై కోర్టులను ఆశ్రయించవచ్చు. ఇదంతా బౌండ్‌డౌన్‌ చేసిన వారి వివరాలతో పోలీసులు రిపోర్ట్‌ చేసినప్పుడే వీలవుతుంది. కానీ చాలా సందర్భాల్లో పోలీసులు అంత వరకు వెళ్లడం లేదు.

తహసీల్దార్‌కు న్యాయపరమైన అధికారాలు

మండల రెవెన్యూ అధికారి అంటే తహసీల్దార్‌ అనుకుంటాం. కానీ ఆయన ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ కూడా. ఆయనకు కొంతవరకు న్యాయపరమైన అధికారాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా పోలీసులు బైండోవర్‌ చేసే సమయంలో తహసీల్దార్‌ ఎదుట హాజరుపరుస్తారు. బైండోవర్‌ తర్వాత ఆ వ్యక్తి ప్రవర్తనలో మార్పు రాకపోతే సమండ్లు జారీ చేసేందుకు జైలుకు పంపించే అధికారం తహసీల్దార్‌కు ఉంది. తప్పు, నేరాన్ని బట్టి బైండోవర్‌ సమయంలో నిర్ధేశిత జరిమానా (రూ.500 నుంచి రూ.లక్ష) విధిస్తుంటారు. మొత్తాన్ని నిర్ణయించవచ్చు. వీటిని చలానా రూపంలో రాష్ట్ర ఖజనాకు చెల్లించాల్సి ఉంటుంది.

Formation of New Districts: కొత్త జిల్లాల‌ ఏర్పాటును ఎవ‌రు ఆమోదించాలి

Published date : 01 Nov 2023 06:12PM

Photo Stories