History of Election Voting: హలో.. నేను ఎవరో తెలుసా.. అదేనండి నేను ‘ఓటు’ని.. నా కథ ఇదే..
నా పేరు ‘ఓటు’. అబ్బా.. ఇప్పటికి గుర్తు పట్టారు. అది సరే కానీ నేను మీ చేతికి ఎలా వచ్చానో నా కథ తెలుసా!. స్వాతంత్య్రానికి పూర్వం 1907లో రాయల్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుపై కొన్ని సిఫార్సులు చేసింది.
1909లో కౌన్సిల్ చట్టం ద్వారా ఓటు హక్కును 10.6 శాతం పెంచారు. ఆ తర్వాత రాజ్యాంగ పరిషత్ ఎన్నికల సందర్భంగా 28.5 శాతం మంది ప్రజలకు ఓటు హక్కు కల్పించింది.
స్వాతంత్య్రం తర్వాత రాజ్యాంగంలోని అధీకరణ 325 ప్రకారం కుల, మత, వర్గ, జాతి, ప్రాంత, లింగ భేదాలు తేడాలతో ఏ వ్యక్తికి ఓటు హక్కు నిరాకరించకూడదని నిర్దేశించింది.
1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా 326 అధీకరణం కింద సార్వత్రిక ప్రయోజన ఓటు హక్కు కలించారు. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు హక్కు కనీస వయో పరిపితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు కుదిరించింది.
బ్యాలెట్ పత్రంపై స్టాంపుతో ఇంకు ముద్రవేసే స్థాయి నుంచి మీట నొక్కి ఓటు వేసే స్థాయికి నన్ను చేర్చారు. అలా ఆంగ్లేయుల కాలంలో ప్రారంభమైన నా ప్రస్థానం చివరికి మీ చేతిలో ఆయుధంగా మారాను. అదండీ నా కథ.
UN Resident Coordinator: నూతన యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా భారత మహిళ..!