Voting Ink History: పోలింగ్ బూత్‌లలో వాడే 'సిరా' చరిత్ర..!
నకిలీ ఓట్లను నిరోధించేందుకు ఎడమ చూపుడు వేలుకు పోలింగ్ బూత్‌లలో నేరేడు రంగులో ఉన్న సిరా పూస్తారు. దీనిని భారత ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేస్తుంది. ఎన్నికల సమయంలో వాడే సిరాను కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ కంపెనీ తయారు చేస్తుంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ అదే కంపెనీ నుంచి సిరా పంపిణీ చేస్తారు.
➤ Talent Programs for Students: ప్రతిభను కనబరిచేందుకు 'కళతిరువిజ పోటీలు..
ఇదే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా 29 దేశాలకు దీనిని ఎగుమతి చేస్తుంటారు. ఈ కంపెనీని మైసూర్ మహారాజు నాల్మడి కృష్ణరాజ వడయారు స్థాపించారు. స్వాతంత్య్రానికి పూర్వం మైసూర్ రాజవంశం ఆధీనంలోనే ఉండేది. తరువాత కంపెనీనీ కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఓటర్లు పలుమార్లు ఓటు వేయకుండా, బోగస్ ఓటర్ల నియంత్రణకు కేంద్ర ఎన్నికల సంఘం చెరిగిపోని గుర్తుని వేలిపై వేయాలని నిర్ణయించింది.
1962లో చెరిగిపోని సిరాను ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కర్మాగారానికి అప్పగించారు. నేరేడు రంగులో ఉండే సిరాలో 7.25 శాతం సిల్వర్ నైట్రేట్ ఉన్నందున వెంటనే చెరిగిపోదు. మొదట్లో ఎడమ చేతి వేలిపై సిరా చుక్కను పెట్టేవారు. 2006 ఫిబ్రవరి నుంచి ఓటర్ల ఎడమ చేతి వేలు–గోరుపై సిరాను గీతగా పెడుతున్నారు. ఈ సారి తెలంగాణ రాష్ట్రానికి రెండు లక్షల సిరా సీసలను సరఫరా చేస్తున్నారు. ఒక్కో సీసా సిరాను గరిష్టంగా 700 మందికి వేయొచ్చు.