Union Budget 2022 Live Updates: వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్ రైళ్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2022–23ను ప్రవేశపెట్టి, ప్రసంగాన్ని ప్రారంభించారు. కొవిడ్ మహమ్మారి తర్వాత భారత్ వేగంగా కోలుకుందని మంత్రి నిర్మల తన ప్రసంగంలో పేర్కొన్నారు. వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. వృద్ధి్ధరేటులో మనం ముందున్నామని తెలిపారు. వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించామని పేర్కొన్నారు.
కొత్తగా 400 వందే భారత్ రైళ్లు..
పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి నిర్మల పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్ రైళ్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు కేటాయించినట్టు నిర్మల తెలిపారు. భారత్‌లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ జరుగుతోందన్నారు.
13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు..
దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టినట్లు నిర్మల తెలిపారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు అందిస్తున్నట్లు నిర్మల పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేవ్ మధ్యలో ఉన్నాం.. వ్యాక్సిన్‌ల వల్ల మేలు జరిగింది. చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్ వన్‌ప్రొడక్ట్ పథకం అమలు చేస్తున్నామని నిర్మల తెలిపారు.
ప్రధాని ఒక మిషన్ సూచించారు..
వందే భారత్ రైలు విజయవంతమైందని నిర్మల తెలిపారు. 75వ వడిలోకి వచ్చిన భారత్‌కు వందేళ్ల అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఆ దిశగా చర్యలు తీసుకుంటామని నిర్మల పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య సౌకర్యాల అభివృద్ధి,వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. వందేళ్ల భారతానికి ప్రధాని మోదీ ఒక మిషన్ రూపొందించారని,దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని నిర్మల అన్నారు.
ఎయిరిండియా బదిలీ సంపూర్ణం..
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల్లో ముందంజలో ఉన్నామని నిర్మల తెలిపారు. ఎయిరిండియా బదిలీని సంపూర్ణం చేశామని పేర్కొన్నారు. పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామని నిర్మల తెలిపారు. ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.
ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ త్వరలోనే ప్రారంభం..
పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని నిర్మల తెలిపారు. పేద వర్గాలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, వ్యవసాయ దారులకు సముచిత స్థానం కల్పిస్తున్నామని నిర్మల తెలిపారు.