Skip to main content

NPS Vatsalya: పిల్లల ఆర్థిక భవిష్యత్‌కు కొత్త పథకం ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం పిల్లల భవిష్యత్తును భరోసాగా నిలిపేందుకు 'ఎన్‌పీఎస్‌ వాత్సల్య' అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది.
FM Nirmala Sitharaman launches NPS Vatsalya Scheme

ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పేరిట పెట్టుబడి పెట్టి, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించవచ్చు. ఈ పథకం ఎన్‌పీఎస్‌ (నేషనల్ పెన్షన్ సిస్టమ్) పథకం ఆధారంగా రూపొందించబడింది.  
 
ఈ పథకాన్ని 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబ‌ర్ 18వ తేదీ ప్రారంభించారు.  ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగంలో 14 శాతం, కార్పొరేట్‌ డెట్‌లో 9.1 శాతం, జీ–సెక్‌లలో 8.8 శాతం చొప్పున రాబడులు ఉన్నాయి. 

ఎవరు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు..? 
ఆన్‌లైన్‌లో లేదంటే ఆఫ్‌లైన్‌లో బ్యాంక్‌ శాఖ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.1,000తో ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకం ప్రారంభించొచ్చు. ఆ తర్వాత నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు పిల్లల పేరుమీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. 18 ఏళ్లు నిండిన వెంటనే వారి పేరు మీద రెగ్యులర్‌ ఎన్‌పీఎస్‌ ఖాతాగా అది మారుతుంది. వారికి 60 ఏళ్లు నిండే వరకు కొనసాగుతుంది. 

New Scheme: వైద్య పరికరాల తయారీకి కొత్త పథకం

ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ ఇప్పటికే ఎన్‌పీఎస్‌ వాత్సల్య ప్రారంభించేందుకు పీఎఫ్‌ఆర్‌డీఏతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌ ముంబైలో ఈ పథకాన్ని ప్రారంభించి, కొందరు పిల్లలను పేరిట ఖాతాలు తెరిపించింది. పిల్లల పేరిట ఈ ఖాతాను ప్రారంభించడం ద్వారా వారి భవిష్యత్తుకు తల్లిదండ్రులు భరోసా కల్పించినట్టు అవుతుంది. పెట్టుబడి దీర్ఘకాలంలో కాంపౌండింగ్‌ ప్రభావంతో మంచి సంపదగా మారుతుంది. 

Published date : 20 Sep 2024 10:03AM

Photo Stories