Skip to main content

Union Budget History and Facts: మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?

RK Shanmugam Shetty
ఆర్కే షణ్ముగం చెట్టి,

Union Budget History and Facts: ఇప్పుడు బడ్జెట్ లెక్కలన్నీ వేలు, లక్షల కోట్లలోనే.. మరి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కేంటి? అప్పుడు మన ఆదాయం ఎంత? రక్షణ శాఖ బడ్జెట్ ఎంత? ఆ వివరాలు తెలుసుకుందామా.. 

మొదటి (1947) బడ్జెట్ వివరాలు (అంకెలు రూ.కోట్లలో)

మంత్రి: ఆర్కే షణ్ముగం చెట్టి, 
తేదీ: 1947, నవంబర్ 26
రెవెన్యూ అంచనా: 171.15
రెవెన్యూ వ్యయం: 197.39
రెవెన్యూ లోటు: 26.24
రక్షణశాఖకు: 92.74
ఆదాయపు పన్ను ద్వారా ఆదాయం: 119
కస్టమ్స్ ఆదాయం: 50.5
ఫారెక్స్ నిల్వలు: 1,547
 

  •  గణతంత్ర భారత దేశంలో మొట్టమొదటి బడ్జెట్‌ను జాన్ మతాయ్ 1950 ఫిబ్రవరి 28న సభలో ప్రవేశపెట్టారు.
  • స్వతంత్ర భారతావనిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి ఆర్‌కే షణ్ముగంశెట్టి. 1947-49 మధ్య బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆయన నెహ్రూతో విభేదాల కారణంగా పదవి నుంచి వైదొలిగారు.
  • 1951-52లో రిజర్వు బ్యాంకు గవర్నర్ సీడీ దేశ్‌ముఖ్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
  • ప్రధానమంత్రిగా కొనసాగుతూ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి వ్యక్తి జవహర్‌లాల్ నెహ్రూ. 1958-59లో ఆర్థికశాఖను కూడా పర్యవేక్షించిన ఆయన ఈ రికార్డు సాధించారు. ఆ తర్వాత ఇదే బాటలో ఇందిరాగాంధీ 1970లో, రాజీవ్ 1987లో ప్రధానులుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
  • కేంద్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌లు ప్రవేశపెట్టి అనంతర కాలంలో రాష్ట్రపతి పదవిని అధిష్టించినవారు ఇద్దరున్నారు. 1980-82 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆర్.వెంకట్రామన్, 1974-75లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత 1982-84 మధ్య, 2009-12 మధ్య ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
  • 1991-92లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఆ ఏడాది తుది, తాత్కాలిక బడ్జెట్లను రెండు పార్టీలకు చెందిన, వేర్వేరు ఆర్థిక మంత్రులు ప్రవేశపెట్టడం గమనార్హం. తాత్కాలిక బడ్జెట్‌ను బీజేపీ నేత యశ్వంత్‌సిన్హా, తుది బడ్జెట్‌ను మన్మోహన్‌సింగ్ ప్రవేశపెట్టారు.
  • అతి తక్కువకాలం కేంద్ర ఆర్థిక మంత్రిగా పనిచేసిన రికార్డు బీజేపీ నేత జశ్వంత్‌సింగ్ పేరిట ఉంది. ఆయన కేవలం 13 రోజుల పాటే కొనసాగారు.
Published date : 01 Feb 2022 11:47AM

Photo Stories