Coromandel: కోరమాండల్ ఫెర్టిలైజర్స్‌కు భారీ రాయితీలు
Sakshi Education
కోరమాండల్ ఫెర్టిలైజర్స్ కాకినాడ ప్లాంట్ విస్తరణ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ 4.0 కింద టైలర్ మేడ్ (కంపెనీకి తగిన విధంగా) రాయితీలను ప్రకటించింది.

సుమారు రూ.1,539 కోట్లతో ఏడాదికి 7.5 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో సల్ఫ్యూరిక్ యాసిడ్, ఫాస్ఫోరిక్ యాసిడ్ యూనిట్‌ను 55 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి కంపెనీ ప్రతిపాదనలు పంపింది.
వీటికి రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ, మంత్రివర్గ ఆమోదం లభించడంతో భారీ రాయి తీలను ప్రకటిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్ యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పాదనల ప్రకారం రెండేళ్లల్లో.. అంటే జనవరి 2027కు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభం కావాలి. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తేనే ఇందుకు అనుగుణంగా రాయితీలు లభిస్తాయి.
రాయితీలు ఇలా..
- పెట్టుబడి సబ్సిడీ 40 శాతం కింద పదేళ్లలో రూ.529 కోట్లు ఇవ్వనున్నారు.
- డీకార్బనైజేషన్ సబ్సిడీగా పదేళ్లలో రూ.74 కోట్లు లభించాయి.
- తొలి ఐదేళ్లలో కొత్త ఉద్యోగాల కల్పన కింద రూ.20 కోట్లు ఇవ్వనున్నారు.
- యూనిట్ విద్యుత్‌పై ఒక రూపాయి సబ్సిడీ లభించనుంది.
- మిగిలిన రాయితీల్లో 45% విడతల వారీగా పది ఇన్‌స్టాల్‌మెంట్లలో చెల్లించనున్నారు.
Published date : 11 Feb 2025 01:25PM