Skip to main content

Nirmala Sitharaman : ఈ విద్య కోసం 200 ఛానెల్స్‌.. త్వ‌ర‌లోనే 5జీ..

నాలుగోసారి పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో మరో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టారు ఆమె. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించుకున్నారు.
Nirmala sitharaman
Nirmala Sitharaman

వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌జోరుగా సాగుతోంది. కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి.  ఆత్మనిర్భర్‌ స్ఫూర్తితో ముందుకు సాగనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వంట నూనె దేశీయంగా తయారీపై దృష్టి. వెయ్యి లక్షల మెట్రిక్‌ టన్నుల వరిని సేకరిస్తామన్నారు.

బడ్జెట్‌ ప్రసంగంలో కీలకాంశాలు కొన్ని.. 

►పీఎం ఆవాస్‌ యోజన కింద 18 లక్షల ఇళ్లు. 48 వేల కోట్లు కేటాయింపు. 75 జిల్లాలో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ కేంద్రాలు. తృణ ధాన్యాల సంవత్సరంగా 2023. 

►యాప్‌లో ప్రజలకు అందుబాటులో బడ్జెట్‌.  వచ్చే ఐదేళ్లలో మేకిన్‌ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రణాళికగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ప్రకటించారు. ఇంటి ఇంటికి మంచి నీటి కోసం 60 వేల కోట్ల కేటాయింపు.

పీఎం ఈ విద్య కోసం..
వ్యవసాయ రంగానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగం, భూ రికార్డులను డిజిటలైజేషన్‌. డ్రోన్‌లతో పంట పొలాల పరిరక్షణ. సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక రాయితీల ప్రకటన.  పీఎం ఈ విద్య కోసం 200 ఛానెల్స్‌. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన.. 1.12 తరగతులకు వర్తింపు. 

➤ ఆతిథ్య రంగానికి రూ. 5 లక్షల కోట్ల కేటాయింపులు. మైక్రో, చిన్నతరహా కంపెనీలకు 2 లక్షల కోట్ల కేటాయింపులు. ఎంఎస్‌  ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్సిటీ. స్టార్టప్‌లకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో 4 మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌లు. అంగన్‌వాడీ 2.0 కింద 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ. 

➤ తెలుగు స్టేట్స్‌లో నదుల అనుసంధానంపై ప్రణాళిక. త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా నదుల అనుసంధానం. పెన్నా-కావేరి నదుల అనుసంధానానికి ప్లాన్‌. గంగా నదీ తీరంలో 5 కిలోమీటర్ల​ మేర సేంద్రీయ సాగు.

➤ అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి. ఇకపై చిప్‌ ఆధారిత పాస్‌ పోర్టులు. 

➤ డిజిటల్‌ పేమెంట్‌, నెట్‌బ్యాంకింగ్‌ సేవలకు ప్రోత్సాహకాలు. గతిశక్తి కార్గొ టెర్మినళ్ల నిర్మాణం. కొత్త రహదారుల నిర్మాణం. పేద, మధ్య తరగతి సాధికారికత కోసం ప్రభుత్వం కృసి చేస్తోందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 

➤ 2022 నాటికి 5జీ స్పెక్ట్రం వేలం పూర్తి చేసే యోచన. ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధనలకు ప్రముఖ స్థానం. ఈ-వెహికల్స్‌ ప్రోత్సహకంలో భాగంగా హైవేలపై బ్యాటరీలు మార్చుకునే సదుపాయం. సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం 19,500 వేల కోట్ల రూ. కేటాయింపు.

➤ అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం. మానసిక ఆరోగ​ వ్యవస్థ కోసం జాతీయ విధానం. 10 రంగాల్లో క్లీన్‌ఎనర్జీ యాక్షన్‌ ప్లాన్‌. ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్‌లు.

➤ ఉత్తర ప్రదేశ్‌కి భారీ పథకం. కెన్‌బెత్వా ప్రాజెక్టుతో 103 మెగావాట్ల విద్యుత్‌. 62 లక్షల మందికి తాగు నీరు.

Union Budget 2022-23: ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉ‍ద్యోగాలు..ప్రణాళిక ఇలా union budget

Union Budget 2022 Live Updates: వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్‌ రైళ్లు

Union Budget History and Facts: మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?

Union Budget 2022 Live Updates: నిర్మలా సీతారామన్‌ అరుదైన ఘనత.. తొలి మహిళగా రికార్డు

Union Budget 2022 : ఈ రాష్ట్రాల‌పైనే కేంద్రం ఫోకస్‌..!

Parliament Budget Session 2022: లోక్‌సభలో 2021–2022 ఆర్థిక సర్వే

Union Budget 2022: నిర్మలా సీతారామన్ చేతి సంచీలో ఏం ఉండబోతోంది..? ఏం ఉంటే బాగుంటుంది..?

Union Budget-2022 Updates: యువతకు భారీగా ఉద్యోగాల కల్పన.. జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయి..

Work From Home: ఉద్యోగులకు ఈసారి బడ్జెట్‌లో భారీ బెనిఫిట్స్‌..!

Union Budget 2022 Expectations: కోటీ ఆశ‌ల‌తో కోట్ల రూపాయ‌లు.. నిర్మలమ్మా బడ్జెట్ ఆశలన్నీ వీరి పైనే..!

Published date : 01 Feb 2022 12:31PM

Photo Stories