Daily Current Affairs in Telugu: 2023, జూన్ 14th కరెంట్ అఫైర్స్
Rozgar Mela: 70,000 మందికి నియామక పత్రాలు పంపిణీ చేసిన మోదీ
ప్రధాని మోదీ జూన్ 13న రోజ్‌గార్ మేళాలో పాల్గొని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 70,000 మందికిపైగా యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. కొన్ని రాష్ట్రాల్లో వారసత్వ పార్టీలు ఉద్యోగాల పేరిట ‘రేటు కార్డ్‌ల’తో యువతను దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం యువత ప్రయోజనాల పరిరక్షణ కోసం(సేఫ్‌గార్డ్) పని చేస్తోందని ఉద్ఘాటించారు. వారసత్వ పార్టీలా? లేక మంచి చేసే ప్రభుత్వమా? యువత భవిష్యత్తు ఎవరిపై ఆధారపడాలన్నది దేశమే తేల్చుకుంటుందని స్పష్టం చేశారు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రోత్సహించడం ద్వారా వారసత్వ పార్టీలు యువతను దగా చేస్తున్నాయని ఆక్షేపించారు. తమ ప్రభుత్వం వచ్చాక పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు ప్రజా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. గతంలో నియామక ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాదికిపైగా సమయం పట్టేదని, ఇప్పుడు నెలల వ్యవధిలోనే పారదర్శకంగా పూర్తి చేస్తున్నామని గుర్తుచేశారు.
G20 Meet: వారణాసిలో ‘జీ20’ డెవలప్‌మెంట్ మంత్రుల సదస్సు
నిర్ణయాత్మకత.. మన గుర్తింపు
సమాజంలో విభజన తెచ్చేందుకు, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు భాషను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి పెడపోకడలు కనిపిస్తున్నాయని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీని, హిందీ భాషను బూచిగా చూపిస్తూ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు రేటు కార్డులు, కట్ మనీ వంటివి కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రేటు కార్డులు యువత కలలను, సామర్థ్యాలను ఛిద్రం చేస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాలు ఇప్పించినందుకు బదులుగా పేద రైతుల నుంచి భూములు తీసుకున్నందుకు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు.
ఆర్థిక వ్యవస్థకు కొత్త ధీమా
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాలతో స్వయం ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. ఆర్థికంగా వేగంగా ముందుకు సాగుతున్నామని, మన దేశ ఆర్థిక వ్యవస్థకు గతంలో ఇలాంటి విశ్వాసం, ధీమా ఎన్నడూ లభించలేదన్నారు.
Cyclone Biparjoy: బిపర్‌జోయ్‌తో భారీ విధ్వంసం..150 కిలోమీటర్ల వేగంతో గాలులు..
అరేబియా సముద్రంలో కొనసాగుతున్న బిపర్‌జోయ్ తుపాను భారీ విధ్వంసాన్ని సృష్టించే ప్రమాదముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.
ఈ ప్రభావం గుజరాత్‌లోని కచ్, ద్వారక, జామ్‌నగర్ జిల్లాలపైనే ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. బిపర్‌జోయ్ జూన్ 13న అత్యంత తీవ్ర స్థాయి నుంచి తీవ్రమైన తుపానుగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది. ఇది గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్, మాండ్వి, జఖౌ పోర్టులతోపాటు పాకిస్తాన్‌లోని కరాచీ మధ్య ఈ నెల 15 సాయంత్రం తీరాన్ని తాకే అవకాశాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
‘కచ్, ద్వారక, జామ్‌నగర్, పోరుబందర్ జిల్లాల్లో ఈ నెల 13– 15 తేదీల మధ్య అత్యంత భారీగా 20 నుంచి 25 సెంటీమీటర్ల మేర కుంభవృష్టి కురియవచ్చు. తీవ్ర ఉధృతితో కూడిన ఈదురు గాలులు, అతి భారీ వర్షాలు కచ్, ద్వారక, జామ్‌నగర్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తి, తీవ్ర నష్టం కలిగించవచ్చు’అని ఐంఎడీ హెచ్చరించింది.
Cyclones: ఆయా దేశాల్లో పిలవబడే తుఫాన్ల పేర్లు ఇవే..
‘రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్‌ల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈ ప్రాంతాల్లో జూన్ 15 వరకు గరిష్టంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఈ కారణంగా పంటలు, నివాసాలు, రహదారులు, విద్యుత్, సమాచార వ్యవస్థలు దెబ్బతింటాయి. సముద్రంలో ఆరు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే అలలు సౌరాష్ట్ర, కచ్ తీరాల్లోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తవచ్చు’అని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర మీడియాకు తెలిపారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున చమురు అన్వేషణ, నౌకల సంచారం, చేపల వేట వంటివాటిని ఈ నెల 16 వరకు నిలిపివేయాలని ఐఎండీ తెలిపింది. తీరాన్ని దాటిన తుపాను బలహీనపడి, తన గమనాన్ని దక్షిణ రాజస్తాన్ వైపు మార్చుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ నెల 15–17 తేదీల్లో ఉత్తర గుజరాత్‌లో భారీ వర్షాలకు కురుస్తాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఈ సీజన్‌లో ఏర్పడిన మొట్టమొదటి తుపాను బిపర్‌జోయ్..సముద్ర జలాల అసాధారణ వేడి వల్లే ఎన్నడూ లేనంత సుదీర్ఘకాలం పాటు తుపాను కొనసాగిందని ఐఎండీ వివరించింది. ఈ నెల 6న ఏర్పడిన ఈ తుపాను జూన్ 13 నాటికి 8 రోజుల 9 గంటలపాటు కొనసాగిందని తెలిపింది.
Greenhouse Gas Emissions: వేగంగా వేడెక్కుతున్న భూమి.. రికార్డు స్థాయికి చేరిన గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలు
30 వేల మంది తరలింపు
బిపర్‌జోయ్ ప్రభావిత జిల్లాలకు చెందిన 30 వేల మందిని తాత్కాలిక షెల్టర్లలోకి తరలించినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది.తుపాను సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు ఒకరు చనిపోయినట్లు తెలిపింది. ముందు జాగ్రత్తగా మూడు రైళ్లను రద్దు చేయడంతోపాటు 55 రైళ్ల ప్రయాణ మార్గాన్ని కుదించినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది. సముద్రంలో ఓ ఆయిల్ రిగ్‌పై పనిచేస్తున్న 50 మంది సిబ్బందిని జూన్ 12న రాత్రి బయటకు తీసుకువచ్చారు. కాండ్లా పోర్టును మూసివేశారు. అక్కడ పనిచేసే 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మన్సుఖ్ మాండవీయ సహా ఐదుగురు కేంద్ర మంత్రులు సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.
Earth Commission: భూమికి డేంజర్ బెల్స్.. ప్రతి ఖండంలోనూ.. ఎటు చూసినా రెడ్ సిగ్నళ్లే
Eric Garcetti: ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యంకానిది భారత దేశానికి సాధ్యమైంది.. అమెరికా రాయబారి
భారత దేశంలో చాయ్ అమ్ముకుంటున్న మహిళకు నూటికి నూరు శాతం తనకు రావాల్సిన సొమ్ము నేరుగా ప్రభుత్వం నుండి డిజిటల్ చెల్లింపుల రూపంలోనే అందుతోంది.
ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా 89.5 మిలియన్ల డిజిటల్ చెల్లింపులతో భారతదేశం పెనుసంచలనం సృష్టించిందన్నారు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి.
ఇదీ నాయకత్వం అంటే..
జూన్ 13న జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి భారతదేశం డిజిటల్ చెల్లింపుల్లోనూ, ఆర్ధిక సాంకేతికతలోనూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్బంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన గురించి, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ ధోవల్ గురించి ప్రస్తావించారు. మోదీ నాయకత్వంలో భారత దేశం సాంకేతికంగా దూసుకుపోతోందని, త్వరలో జరగబోయే అమెరికా పర్యటనతో మన రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్టమవుతాయన్నారు. అజిత్ ధోవల్ గురించి చెబుతూ ఆయన భారత దేశానికి దొరికిన గొప్ప సంపదని అన్నారు.
Colombian children: విమాన ప్రమాదంలో తప్పిపోయిన 40 రోజుల తరువాత మృత్యుంజయులుగా బయటకి వచ్చిన చిన్నారులు..!
ఒప్పందాలు.. పెనుమార్పులు..
ఇక ఇదే కార్యక్రమానికి హాజరైన అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివాన్ మాట్లాడుతూ.. భారత ప్రధాని రాక కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎదురు చూస్తున్నారన్నారు. వచ్చే వారం వాషింగ్టన్‌లో పర్యటించనున్న మోదీ రక్షణ విభాగంలోనూ, వాణిజ్య విభాగంలోనూ అమెరికాతో చేయనున్న ఒప్పందాలు రెండు దేశాల మధ్య అనేక అడ్డంకులను తొలగించి సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయన్నారు.
Venice Grand: ఆసక్తికర ఘటన.. రాత్రికి రాత్రే రంగు మారిన కెనాల్ నీరు.. కారణమేమిటంటే..?
Forbes Global List: ప్రపంచ దేశాల్లోని దిగ్గజ కపెనీలని వెనక్కి నెట్టిన రిలయన్స్..
దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా భారీ అంతర్జాతీయ సంస్థల జాబితాలో మరింత పై స్థానానికి చేరింది.
2023 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన గ్లోబల్ 2000 కంపెనీల లిస్టులో 8 స్థానాలు ఎగబాకి 45వ ర్యాంకు దక్కించుకుంది. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ గ్రూప్, స్విట్జర్లాండ్ దిగ్గజం నెస్లే, చైనా సంస్థ ఆలీబాబా గ్రూప్ మొదలైన వాటిని కూడా అధిగమించింది. 109.43 బిలియన్ డాలర్ల ఆదాయం, 8.3 బిలియన్ డాలర్ల లాభాలు నమోదు చేయడంతో రిలయన్స్ ర్యాంకు మెరుగుపడింది. టాప్ 100 జాబితాలో రిలయన్స్‌తో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 77వ స్థానంలో నిల్చింది. 2000 కంపెనీల లిస్టులో మొత్తం మీద 55 భారతీయ సంస్థలు.. ర్యాంకులను దక్కించుకున్నాయి.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో దెబ్బతిన్నప్పటికీ అదానీ గ్రూప్‌నకు చెందిన 3 సంస్థలు లిస్టులో నిల్చాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ (1,062), అదానీ పవర్ (1,488), అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (1,598 ర్యాంకు) వీటిలో ఉన్నాయి. అమ్మకాలు, లాభాలు, అసెట్‌లు, మార్కెట్ విలువ అంశాల ప్రాతిపదికన ఫోర్బ్స్ ఈ ర్యాంకులు ఇచ్చింది.
UPI Activation: ఇకపై ఆధార్‌తో కూడా యూపీఐ యాక్టివేషన్
జేపీమోర్గాన్ టాప్..
ఫోర్బ్స్ లిస్టులో 3.7 లక్షల కోట్ల డాలర్ల అసెట్స్‌తో జేపీమోర్గాన్ అగ్రస్థానం దక్కించుకుంది. సౌదీ చమురు సంస్థ ఆరామ్‌కో 2వ స్థానంలో, చైనాకు చెందిన మూడు భారీ ప్రభుత్వ రంగ బ్యాంకులు వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. గతేడాది టాప్ ర్యాంకులో ఉన్న బెర్క్‌షైర్ హాథ్‌వే ఈసారి 338వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో నష్టా ల్లో ఉండటమే ఇందుకు కారణం. ఈ ఏడాది మే 5 నాటికి అందుబాటులో ఉన్న గత 12 నెలల గణాంకాల ప్రకారం ఫోర్బ్స్ ఈ లిస్టును రూపొందించింది.
జాబితాలోని కంపెనీల మొత్తం విక్రయాలు 50.8 లక్షల కోట్ల డాలర్లుగా, లాభాలు 4.4 లక్షల కోట్ల డాలర్లుగా, అసెట్స్ 231 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నాయి. 58 దేశాలకు చెందిన లిస్టెడ్ కంపెనీలకు చోటు దక్కింది. 611 కంపెనీలతో అమెరి కా అగ్రస్థానంలో ఉండగా 346 సంస్థలతో చైనా రెండో స్థానంలో ఉంది.
GST Collections: పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు.. తాజా గణాంకాల్లోని ముఖ్యాంశాలివే..
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP