UPI Activation: ఇకపై ఆధార్‌తో కూడా యూపీఐ యాక్టివేషన్
Sakshi Education
డిజిటల్ చెల్లింపు సేవల యాప్ గూగుల్ పే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.
డెబిట్ కార్డు అవసరం లేకుండా ఆధార్ నంబరుతో కూడా యూపీఐని యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే, మొబైల్ ఫోన్ నంబరు, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబరు ఒకదానికి మరొకటి అనుసంధానమై ఉంటేనే ఇది పనిచేస్తుంది.
దీనితో తమ యూజర్లు డెబిట్ కార్డు లేకుండానే తమ యూపీఐ పిన్ నంబరును సెట్ చేసుకోవచ్చని గూగుల్ పే తెలిపింది. గూగుల్ పే యాప్‌లో ఇకపై ఖాతా యాక్టివేషన్ కోసం డెబిట్ కార్డు, ఆధార్ నంబరు ఆ ప్షన్లు కనిపిస్తాయి. యూజర్లు వీటిలో ఏదైనా ఒకటి ఎంచుకుని యాక్టివేట్ చేసుకోవచ్చని గూగుల్ ప్రో డక్ట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ శరత్ బులుసు తెలిపారు.
Insurance: అప్పటికల్లా అందరికీ బీమా.. మూడంచెల విధానం.. యూపీఐ తరహా విప్లవం..!
Published date : 08 Jun 2023 02:43PM