Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 3rd కరెంట్ అఫైర్స్
CAG Audit Report: తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై CAG లెక్కలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022 - 23) తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పడుతూ లేస్తూ సాగుతోంది. తొలి రెండు నెలల్లో అన్ని రకాల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండటం, అప్పులు తెచ్చుకొనేందుకు ఆర్‌బీఐ అంగీకరించకపోవడంతో కాసులకు కటకట ఏర్పడినా ఆ తర్వాత రాబడులు క్రమంగా పుంజుకోవడంతో ప్రస్తుతానికి ఓ గాడిన పడిందని ‘కాగ్’ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల ప్రకారం తొలి 5 నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ. 80 వేల కోట్లు చేరగా సెప్టెంబర్‌లో అప్పులు, ఆదాయం కలిపి మరో రూ. 15 వేల కోట్లు దాటి ఉంటుందని, మొత్తంగా రూ. లక్ష కోట్లు అటుఇటుగా తొలి 6 నెలల్లో ఖజానాకు చేరిందని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Also read: Weekly Current Affairs (Awards) Bitbank: 64వ రామన్ మెగసెసే అవార్డు 2022 గ్రహీతలు ఎవరు?
స్థిరంగా పన్ను ఆదాయం..
కాగ్ లెక్కలను పరిశీలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం స్థిరంగా వస్తోంది. ఏప్రిల్, మేలలో రూ. 9 వేల కోట్ల మార్కు దాటిన పన్నుల రెవెన్యూ ఆ తర్వాతి మూడు మాసాల్లో రూ. 10 వేల కోట్ల మార్కు దాటింది. పన్నేతర ఆదాయం ఎప్పటిలాగానే స్తబ్దుగా ఉండగా జూన్‌లో వచ్చిన రూ. 6 వేల కోట్లతో కొంత ఫరవాలేదనిపించింది. ఇక కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుచూపులు తప్పడం లేదు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 40 వేల కోట్లు ఈ పద్దు కింద వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా అందులో కేవలం 10 శాతం అంటే రూ. 4,011 కోట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రం నుంచి వచ్చే పన్నుల్లో వాటా పద్దు మాత్రం 34 శాతానికి చేరింది. ఈ పద్దు కింద 5 నెలల్లో రూ. 4,263 కోట్లు వచ్చాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంమీద గతేడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం, ఖర్చు ఎక్కువగా ఉండగా అప్పులు మాత్రం గతేడాది కంటే తక్కువగానే ఉండటం గమనార్హం.
ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వివరాలు
నెల | పన్నుఆదాయం | పన్నేతర ఆదాయం | గ్రాంట్ ఇన్ ఎయిడ్ |
ఏప్రిల్ | 9,291.97 | 502.17 | 189.66 |
మే | 9,459.42 | 411.44 | 101.54 |
జూన్ | 10,461.02 | 5961.35 | 1,134.51 |
జూలై | 10,029.64 | 557.58 | 563.05 |
ఆగస్టు | 10,463.37 | 407.42 | 2,022.84 |
Also read: S&P Rating : వర్ధమాన దేశాల్లో ‘స్టార్’ భారత్
అప్పులు రూ. 17 వేల కోట్ల పైమాటే..
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 50 వేల కోట్ల మేర అప్పుల ద్వారా నిధులు సమీకరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా గత 5 నెలల్లో రూ. 17 వేల కోట్ల వరకు అప్పుల రూపంలో సమకూరాయి. ఇందులో తొలి రెండు నెలలు కనీసం రూ. 300 కోట్లు కూడా అప్పులు దాటలేదు. కేంద్ర ప్రభుత్వంతో ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధి విషయంలో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మేలలో సెక్యూరిటీలు, బాండ్ల విక్రయానికి ఆర్‌బీఐ అంగీకరించలేదు. ఆ తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో జూన్‌లో రూ. 5,161 కోట్లు, జూలైలో రూ. 4,904.94 కోట్లు, ఆగస్టులో రూ. 7,501.56 కోట్ల రుణాలను ప్రభుత్వం తీసుకోగలిగింది. ఈ రుణ సర్దుబాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక సంవత్సరం ముగిసేంతవరకు కొనసాగుతుందని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. లేదంటే మాత్రం కాసులకు కటకట తప్పనట్టే!
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 30th కరెంట్ అఫైర్స్
5G సేవలు ప్రారంభించిన ప్రధాని మోదీ
అత్యంత హై–స్పీడ్ ఇంటర్నెట్ సేవలకు చిరునామాగా మారనున్న ఐదోతరం(5జీ) టెలీ సేవలు దేశ ప్రజలకు అందుబాటులోకి వచ్చేశాయి. టెలీ సేవల రంగంలో విప్లవాత్మక మార్పులకు, టెలీ వాణిజ్యరంగంలో అనంతమైన అవకాశాలకు నాంది పలికామని 5జీ సేవల ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ప్రకటించారు. 5జీ టెలిఫొనీ సర్వీస్‌ల శ్రీకారానికి అక్టోబర్ 1న ఢిల్లీలో ఆరో ‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్’ కార్యక్రమం వేదికైంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘టెలికం పరిశ్రమ.. దేశ ప్రజలకు 5జీ రూపంలో కొత్త బహుమతిని తీసుకొచ్చింది. దేశంలోని వందల కోట్ల డివైజ్‌ల మధ్య 4జీని మించిన వేగంతో అనుసంధానానికి 5జీ బాటలు పరిచింది. దీంతో వైద్యం, విద్య, వ్యవసాయం, విపత్తు నిర్వహణ రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధ్యంకానున్నాయి. జియో 5జీ సేవలు 2023 డిసెంబర్‌కల్లా , ఎయిర్‌టెల్ 5జీ 2024 మార్చికల్లా మొత్తం భారతావనికి అందుబాటులోకి రానున్నాయి. గతంలో 2జీ, 3జీ, 4జీ సేవల కోసం విదేశాలపై ఆధారపడిన భారత్... నేడు దేశీయ టెక్నాలజీతో విదేశాలు విస్తుపోయేలా 5జీలో సత్తా చాటింది. 5జీ ఒక కొత్త శకానికి నాంది. టెలీ వాణిజ్యంలో అపార వ్యాపార అవకాశాల గని మన ముందుకొచ్చింది’ అని మోదీ అన్నారు.
Also read: తెలంగాణలో schneider రెండో ప్లాంట్
డిజిటల్ భారత్‌కు మూలస్తంభాలు
‘5జీతో దేశం తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలను అందుకుంది. డిజిటల్ ఉపకరణాల ధర, కనెక్టివిటీ, డేటా ఖర్చు, డిజిటల్ దిశగా ముందడుగు–– ఇవే డిజిటల్ భారత్‌కు నాలుగు మూలస్తంభాలు. డిజిటల్ ఇండియా పేరుకే ప్రభుత్వ పథకం. వాస్తవానికి ఈ పథకం లక్ష్యం.. సామాన్యునికి మెరుగైన సేవలు అందించడం. ప్రభుత్వ చొరవతోనే ఎనిమిదేళ్ల క్రితం కేవలం రెండు ఉన్న మొబైల్ తయారీయూనిట్లు నేడు 200కుపైగా పెరిగాయి. డేటా చార్జీలనూ నేలకు దించాం. 2014లో 1 జీబీ డేటాకు రూ.300 ఖర్చయ్యేది. ఇప్పుడు కేవలం రూ.10 అవుతోంది’ అని మోదీ అన్నారు. 5జీని బీజేపీ సర్కార్ ఘనతగా పేర్కొంటూ.. గత యూపీఏ హయాం నాటి 2జీ స్పెక్టమ్ స్కామ్‌ను ప్రధాని ప్రస్తావించారు. ‘2జీకి 5జీకి తేడా ఇదే’ అని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలో రెండో అతిపెద్ద టెలి కమ్యూనికేషన్స్ సర్వీసెస్ సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ శనివారం తన 5జీ సేవలను ఈ కార్యక్రమంలో ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, వారణాసి, బెంగళూరుసహా ఎనిమిది నగరాల్లో ఈ సేవలు మొదలయ్యాయి. టెలి కమ్యూనికేషన్స్‌లో టాపర్ అయిన రిలయన్స్ జియో ఈ నెలలోనే 4 మెట్రో నగరాల్లో తన 5జీ సేవలు మొదలుపెట్టనుంది. మరో ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా తన సేవల ప్రారంభ తేదీని ఇంకా ప్రకటించలేదు. భిన్న రంగాల్లో 5జీ సేవల ఉపయోగాన్ని ఈ మూడు టెలీ కమ్యూనికేషన్స్ సంస్థలు ‘మొబైల్ కాంగ్రెస్’లో ప్రదర్శించాయి. అగ్యుమెంట్ రియాలిటీ(ఏఆర్) డివైజ్ లేకుండానే ఎగ్యుమెంట్ రియాలిటీని స్కీన్‌పై చూస్తూ 3 వేర్వేరు ప్రాంతాల పాఠశాల విద్యార్థులతో మోదీ మాట్లాడారు.
Also read: Chief of Defence Staff గా చౌహాన్
స్వీడన్‌లోని కారును ఢిల్లీ నుంచే నడిపారు
ఆరో ‘ఇండియన్ మొబైల్ కాంగ్రెస్’ వేదికపై 5జీ టెక్నాలజీని ప్రధాని మోదీ పరీక్షించారు. 5జీ లింక్ ద్వారా స్వీడన్‌లోని కారును ఢిల్లీలోని ఎరిక్సన్ మొబైల్ బూత్ నుంచే ప్రధాని మోదీ టెస్ట్‌డ్రైవ్ చేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
Also read: Durham University Study : తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆహారంపై ఇష్టం
Tesla Robo ‘ఆప్టిమస్’
ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా తాజాగా ఒక రోబోను అభివృద్ధి చేసింది. దీనికి అప్టిమస్ అని నామకరణం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో పాలో అల్టోలో ఉన్న టెస్లా కార్యాలయంలో సెప్టెంబర్ 30న రాత్రి ఈ మరమనిషిని ప్రదర్శించారు. వేదికపై వెనక్కి, ముందుకు నడుస్తూ నాట్యం చేస్తూ ఆహూతులను అలరించింది. వేదికపై తన యజమానికి, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కు అభివాదం చేసింది. ఇది ప్రోటోటైప్ హ్యూమనాయిడ్ రోబో అని టెస్లా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని వెల్లడించాయి. దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నాయి. వైర్లతో అనుసంధానం లేకుండా వేదికపై డ్యాన్స్ చేసిన తొలి రోబో బహుశా ఇదే కావొచ్చని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఇకపై ఆప్టిమస్ రోబోలను విక్రయిస్తామని, ఒక్కోటి 20 వేల డాలర్లకు కొనుగోలు చేయొచ్చని సూచించారు. అంటే కొన్ని రకాల టెస్లా కార్ల కంటే దీని ధర తక్కువే. వచ్చే మూడు–ఐదేళ్లలో ఆర్డర్లు తీసుకుంటామని మస్క్ తెలిపారు.
PUC ఉంటేనే బంకుల్లో పెట్రోల్, డీజిల్
ఢిల్లీలోని వాహనదారులు డీజిల్, పెట్రోల్ కోసం పెట్రోల్ పంపుల్లో పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ (పీయూసీ) చూపించడం తప్పనిసరి. అక్టోబర్ 25 నుంచి ఇది అమల్లోకి రానుందని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు. పీయూసీ లేని వాహన యజమానులకు 6 నెలల వరకు జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా ఉంటుందన్నారు. మోటారు వాహన చట్టం ప్రకారం అవసరమైతే ఈ రెండు శిక్షలు అమలవుతాయని కూడా స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. నిబంధనలను వారంలో వెల్లడి చేస్తామన్నారు.
Also read: క్యాన్సర్ కణితి పెరుగుదలను పర్యవేక్షించే పరికరాన్ని ఎవరు కనుగొన్నారు..?
‘ఢిల్లీలో కాలుష్యానికి వాహన ఉద్గారాలు కూడా ఒక కారణమే. ఢిల్లీ రవాణా శాఖ తాజా గణాంకాల ప్రకారం..13 లక్షల ద్విచక్ర వాహనాలు, 3 లక్షల కార్లు సహా మొత్తం 17 లక్షల వాహనాలకు పీయూసీ లేదు’అని మంత్రి చెప్పారు. ‘నో పీయూసీ, నో ఫ్యూయెల్’ కార్యక్రమం అమలుపై మార్చిలో ఇచ్చిన నోటిఫికేషన్‌తో అందిన పలు సలహాలు, సూచనలు అందాయి. వీటిపై తాజాగా పర్యావరణం, రవాణా, ట్రాఫిక్ విభాగాల అధికారులతో జరిగిన సమావేశంలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని రాయ్ అన్నారు. ఢిల్లీలో కాలుష్య నివారణకు తీసుకునే చర్యల అమలు కోసం అక్టోబర్ 3వ తేదీ నుంచి వార్ రూం పనిచేస్తుందని కూడా రాయ్ వెల్లడించారు.
Also read: European researchers: ఊదా రంగు టమాటాకు అమెరికా ఆమోదం
Russia Referendum పై ఓటింగ్‌కు భారత్ దూరం
ఉక్రెయిన్‌లోని 4 కీలక ప్రాంతాలను వీలినం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా నిర్వహించి ‘చట్టవిరుద్ధ రిఫరెండం’పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. భారత్ ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది. రష్యా మాత్రం వీటో చేసింది. రష్యా రిఫరెండాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, ఆల్బేనియా దేశాలు భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై సెప్టెంబర్ 30న ఓటింగ్ నిర్వహించారు.
ఉక్రెయిన్‌లోని లుహాన్‌స్క్, డొనెట్‌స్క్, ఖేర్సన్, జపొరిజాజియాలను రష్యాలో విలీనం చేస్తూ ఒప్పంద పత్రాలపై పుతిన్ సంతకాలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఓటింగ్ జరగడం గమనార్హం. అయితే, భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వీటో చేయడంతో అమెరికా, ఆల్బేనియా తీర్మానం ఆమోదం పొందలేదు. భద్రతా మండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉండగా, 10 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. భారత్, చైనా, గబాన్, బ్రెజిల్ మాత్రం ఓటింగ్‌లో పాల్గొనలేదు.
Also read: Weekly Current Affairs (Economy) Bitbank: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తంలో GST వసూలు చేసింది?
ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు. ఉక్రెయిన్ పరిణామాలు భారత్‌కు అందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి శాంతిని సాధించలేరని తెలిపారు. హింసకు స్వస్తి పలికితేనే ఉక్రెయిన్–రష్యా సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని సూచించారు.
ఉక్రెయిన్‌లో రష్యా చేపట్టిన రిఫరెండం చెల్లదని ఐరాసలోని అమెరికా ప్రతినిధి లిండా థామస్–గ్రీన్‌ఫీల్డ్ తేల్చి చెప్పారు.
సెప్టెంబర్‌లో GST వసూళ్లు రూ.1.47లక్షల కోట్లు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో జోష్ మరింత పెరిగింది. ఈ ఏడాది మార్చి నుంచి వరసగా ఏడోసారి జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటేశాయి. గడిచిన సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,47,686 కోట్లుగా ఉందని అక్టోబర్ 1న కేంద్ర ఆర్ధిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సెంట్రల్ జీఎస్టీ రూ.25,271 కోట్లు, రాష్ట్ర జీఎస్టీ రూ.31,813 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.80,464 కోట్లు(వస్తువుల దిగుమతిపై సేకరించిన మొత్తం రూ.41,215 కోట్లతో కలిపి), సెస్ రూ.10,137 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.856 కోట్లతో కలిపి)గా నమోదయ్యాయి.
Also read: Chalukya Dynasty Important Bitbank in Telugu: వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
ఈ సెప్టెంబర్ వసూళ్లు.. గత ఏడాది సెప్టెంబర్ నెల వసూళ్లతో పోలిస్తే ఏకంగా 26 శాతం ఎక్కువ కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 39 శాతం పెరిగింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు 22 శాతం ఎక్కువయ్యాయి. జీఎస్టీ వసూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఎనిమిదవ సారి. రూ.1.4 లక్షల కోట్ల మార్క్ దాటం ఈ ఏడాది మార్చి నుంచి చూస్తే వరుసగా ఏడోసారి.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 29th కరెంట్ అఫైర్స్
ఈ ఏడాదిలో అత్యధిక సింగిల్ డే కలెక్షన్ జూలై 20న నమోదైంది. ఆ రోజు 9.58 లక్షల చలాన్‌ల ద్వారా రూ.57,846 కోట్లు వచ్చాయి. రెండో అత్యధిక సింగిల్ డే కలెక్షన్‌లు సెప్టెంబర్ 20న నమోదయ్యాయి.
ఏపీలో 21 శాతం.. తెలంగాణలో 12 శాతం
జీఎస్టీ వసూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలు గణనీయ వృద్ధిని సాధించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2,595 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది 21 శాతం మేర పెరిగి రూ.3,132 కోట్లకు చేరిందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది రూ.3,494 కోట్లుగా ఉన్న జీఎస్టీ వసూళ్లు 12శాతం మేర పెరిగి రూ.3,915 కోట్లకు పెరిగాయని వెల్లడించింది.
Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 28th కరెంట్ అఫైర్స్
Swachh Sarvekshan Awards 2022 - తెలంగాణకు 16 పురస్కారాలు
దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో జరిగిన స్వచ్ఛతా కార్యక్రమాల్లో మంచి పురోగతి చూపిన నగరాలకు కేంద్రం స్వచ్ఛ సర్వేక్షణ్–2022 అవార్డులను అందజేసింది. అక్టోబర్ 1న ఢిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అన్ని కేటగిరీల్లో కలిపి మొత్తం 160కిపైగా అవార్డులను ఇచ్చారు. అందులో తెలంగాణకు 16 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయి. సౌత్‌జోన్ విభాగంలో తెలంగాణ 15 అవార్డులకు కైవసం చేసుకోగా.. 100కుపైగా మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు ఉన్న రాష్ట్రాల జాబితాలో 2990 స్కోర్‌తో 4వ ర్యాంకు సాధించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పురీ చేతుల మీదుగా మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, రాష్ట్ర అధికారులు అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు కూడా పాల్గొన్నారు.
Also read: ISL Competitions లో TS కి 3 అవార్డులు
ఏ నగరానికి ఏ ర్యాంకు?
దేశంలో లక్షకుపైగా జనాభా ఉన్న టాప్–100 పట్టణ స్థానిక సంస్థల్లో గ్రేటర్ హైదరాబాద్ 26వ ర్యాంకు, సిద్దిపేట 30వ ర్యాంకు, వరంగల్ 84వ ర్యాంకు, కరీంనగర్ 89వ ర్యాంకు సాధించాయి. లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న టాప్–100 పట్టణాల్లో బడంగ్‌పేట్ 86వ ర్యాంకు పొందింది. ఇక దేశంలోని కంటోన్మెంట్ బోర్డులకు ఇచ్చిన ర్యాంకుల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ 4వ ర్యాంకు సాధించడంతోపాటు పౌరుల అభిప్రాయాలు తీసుకొనే ఉత్తమ కంటోన్మెంట్ బోర్డుగా నిలిచింది.
Also read: Tourism Awards : తెలంగాణ, ఏపీకి 4 జాతీయ పర్యాటక అవార్డులు
సౌత్‌జోన్ పరిధిలో రాష్ట్రానికి స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు ఇవీ..
50 వేలు–లక్ష జనాభా ఉన్న పట్టణాల కేటగిరీ
1) పరిశుభ్రమైన నగరం: బడంగ్‌పేట్
2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: కోరుట్ల
3) స్వయం సమృద్ధి నగరం: సిరిసిల్ల
Also read: National Tourism Award : సత్తాచాటిన ఏపీ.. టూరిజం అభివృద్ధిలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు
25వేలు–50వేల మధ్య జనాభా కేటగిరీ
1) పరిశుభ్రమైన నగరం: గజ్వేల్
2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: తుర్కయాంజాల్
3) పౌరుల అభిప్రాయాలు తీసుకున్న నగరం: వేములవాడ
15వేలు–25 వేల మధ్య జనాభా కేటగిరీ
1) పరిశుభ్రమైన నగరం: ఘట్‌కేసర్
2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం: కొంపల్లి
3) పౌరుల అభిప్రాయాలు తీసుకున్న నగరం: హుస్నాబాద్
4) స్వయం సమృద్ధి నగరం: ఆదిభట్ల
Also read: Digital Health Services : ఏపీకి 6 అవార్డులు
15 వేలలోపు జనాభా కేటగిరీ
1) పరిశుభ్రమైన నగరం: కొత్తపల్లి
2) వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం:
చండూరు
3) పౌరుల అభిప్రాయాలు తీసుకున్న నగరం:
నేరడుచెర్ల
4) ఆవిష్కరణలు, ఉత్తమ పద్ధతులు
అవలంబిస్తున్న నగరం: చిట్యాల
5) స్వయం సమృద్ధి నగరం: భూత్పూర్
Also read: NSS Award: కాకతీయ వర్సిటీకి ఎన్‌ఎస్‌ఎస్ అవార్డు.. ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
Swachh Sarvekshan Awards 2022 - టాప్–10లో 3 ఏపీ నగరాలు
ఏపీలోని పలు నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో అనుసరిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలకు స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పలు అవార్డులు సొంతమయ్యాయి. జాతీయ స్థా యిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మునిసిపల్ కార్పొ రేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా షెహర్’ అవార్డు దక్కింది. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్ దీప్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, మున్సి పల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మిలు ఈ అవార్డులను అందుకున్నారు.
స్వచ్ఛ సర్వే క్షణ్– 2022లో ఏపీ జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలవగా, లక్ష కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో జీవీఎంసీ, విజయవాడ, తిరుపతి కార్పొరేషన్లు టాప్–10 కేటగిరీలో స్థానం సంపాదించాయి. కర్నూలు, నెల్లూరు, కడప, రాజమహేంద్రవరం యూఎల్బీలు (అర్బన్ లోకల్ బాడీస్) కూడా టాప్–100 కేటగిరీలో నిలిచాయి.
సౌత్ జోన్‌లో 50 వేల నుంచి లక్ష జనాభా కేటగిరీలో టాప్–100 యూఎల్బీల్లో 21 నగరాలు నిలిచాయి. ఇందులో పుంగనూరు మున్సిపాలిటీ 3వ ర్యాంకు, పులివెందుల 9వ ర్యాంకు సాధించాయి.
25 – 50 వేల జనాభా విభాగంలో 8 యూఎల్బీలు టాప్ 100 ర్యాంకింగ్‌లో నిలిచాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ‘స్వచ్ఛ రాష్ట్ర రాజధాని నగరం’గా నిలవగా,
10–40 లక్షల జనాభా కేటగిరీలో విశాఖ ‘క్లీన్ బిగ్ సిటీ’గా అవార్డు పొందింది.
సౌత్ జోన్‌లోని 50 వేలు– లక్ష జనాభా కేటగిరీలో ‘ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసె స్ విభాగంలో పులివెందుల, 25 – 50 వేల జనాభా కేటగిరిలో సాలూరు అవార్డు సాధించగా, ప్రజాభిప్రాయం విభాగంలో పుంగనూరును మున్సిపాలిటీ అవార్డులను సొంతం చేసుకున్నాయి.
ఇండియన్ స్వచ్ఛతాలీగ్ విభాగంలో మిలియ న్ ప్లస్ కేటగిరీలో విశాఖ ‘టాప్ ఇంపాక్ట్ క్రియేటర్’ అవార్డు సొంతం చేసుకోగా, ప్రత్యేక కేటగిరీలో శ్రీకాకుళం కార్పొరేషన్, పొదిలి యూఎల్బీలు అవార్డులను అందుకున్నాయి.
చెత్త రహిత నగరాల్లో తిరుపతి, విశాఖ, విజయవాడ కార్పొరేషన్లు ‘ఫైవ్ స్టార్’ రేటింగ్ సాధించాయి.
tel aviv tennis 2022 : బోపన్న జోడీకి టైటిల్
భారత టెన్నిస్ సీనియర్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్‌లో 22వ డబుల్స్ టైటిల్‌ను సాధించాడు. అక్టోబర్ 2న జరిగిన టెల్ అవీవ్ ఏటీపీ–250 టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్ బోపన్న (భారత్)–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–2, 6–4తో సాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)–ఆండ్రెస్ మొల్తెని (అర్జెంటీనా) ద్వయంపై గెలిచింది. ఈ ఏడాది 42 ఏళ్ల బోపన్నకిది మూడో డబుల్స్ టైటిల్. పుణే ఓపెన్, అడిలైడ్ ఓపెన్‌లలో అతను రామ్‌కుమార్ జోడీగా డబుల్స్ టైటిల్స్ సాధించాడు. బోపన్న–మిడిల్‌కూప్ జోడీకి 50,180 డాలర్ల (రూ. 40 లక్షల 94 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు?
Nationa Games 2022 : ఏపీ, తెలంగాణకు పతకాలు
జాతీయ క్రీడల్లో అక్టోబర్ 2న తెలంగాణకు ఒక రజత పతకం లభించింది. మరో రెండు పతకాలు ఖరారయ్యాయి. మహిళల షూటింగ్ స్కీట్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణకు చెందిన రష్మీ రాథోడ్ 25 పాయింట్లు స్కోరు చేసి రజతం సాదించింది. బ్యాడ్మింటన్ టీమ్ ఈవెంట్‌లో తెలంగాణ జట్టు ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో తెలంగాణ 3–2తో మహారాష్ట్రపై నెగ్గింది. నిర్ణాయక ఐదో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి–పుల్లెల గాయత్రి జోడీ 21–9, 21–16తో సిమ్రన్–రితిక జంటను ఓడించి తెలంగాణను గెలిపించింది.
Also read: Weekly Current Affairs (Persons) Bitbank: DRDO కొత్త ఛైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఖాతాలో అక్టోబర్ 2న రెండు రజత పతకాలు చేరాయి. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 64 కేజీల విభాగంలో విజయనగరం జిల్లాకు చెందిన ఎస్.పల్లవి రజతం సాధించింది. 18 ఏళ్ల పల్లవి మొత్తం 199 కేజీల బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో జి.కార్తీక రజతం సాధించింది. కార్తీక 12.85 మీటర్ల దూరం దూకింది. అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి యెర్రాజీ ఫైనల్ చేరింది.
World TT 2022 : రెండో సీడ్ జర్మనీపై భారత్ విజయం
ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సంచలనం సృష్టించింది. గ్రూప్–2లో భాగంగా అక్టోబర్ 2న జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–1తో రెండో సీడ్, టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జర్మనీ జట్టును ఓడించింది. ప్రపంచ 37వ ర్యాంకర్ సత్యన్ జ్ఞానశేఖరన్ గొప్ప ప్రదర్శనతో రెండు మ్యాచ్‌ల్లో గెలిచి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి మ్యాచ్‌లో సత్యన్ 11–13, 4–11, 11–8, 11–4, 11–9తో 36వ ర్యాంకర్ డూడా బెనెడిక్ట్‌ను ఓడించాడు. రెండో మ్యాచ్‌లో హర్మత్ దేశాయ్ 7–11, 9–11, 13–11, 3–11తో డాంగ్ కియు చేతిలో ఓడిపోయాడు. మూడో మ్యాచ్‌లో 142వ ర్యాంకర్ మానవ్ ఠక్కర్ 13–11, 6–11, 11–8, 12–10తో 74వ ర్యాంకర్ రికార్డో వాల్తెర్‌పై గెలవడంతో భారత్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగో మ్యాచ్‌లో సత్యన్ 10–12, 7–11, 11–8, 11–8, 11–9తో ప్రపంచ 9వ ర్యాంకర్ డాంగ్ కియును ఓడించడంతో భారత్ చిరస్మరణీయ విజయం సాధించింది. చెక్ రిపబ్లిక్‌తో జరిగిన గ్రూప్–5 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3–0తో గెలిచి తొలి విజయం నమోదు చేసింది.
Also read: Weekly Current Affairs (National) Bitbank: 300 మీటర్ల పొడవైన అటల్ వంతెన ఏ నగరంలో ప్రారంభించబడింది?
Singapore Grand Prix : విజేత పెరెజ్
రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెర్జియో పెరెజ్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో రెండో విజయం సాధించాడు. అక్టోబర్ 2న జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో పెరెజ్ విజేతగా నిలిచాడు. 59 ల్యాప్‌ల ఈ రేసును పెరెజ్ అందరికంటే వేగంగా 2గం: 02ని.15.238 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన లెక్‌లెర్క్ (ఫెరారీ) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో 11 విజయాలు సాధించిన వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 9న జరుగుతుంది.
Mission Bhageeratha కు జలజీవన్ పురస్కారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకానికి కేంద్ర ప్రభుత్వ జలజీవన్ మిషన్ పురస్కారం లభించింది. గ్రామాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్ల ద్వారా రోజూ తాగునీరు అందిస్తున్నందుకుగాను కేంద్రం తెలంగాణను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. అక్టోబర్ 2 ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావులు జలజీవన్ పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణలోని 53,86,962 గృహాలకు 100% నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీరు అందిస్తున్న పెద్ద రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించింది. కవరేజీ కనెక్షన్ల జాబితాలో తెలంగాణ రాష్ట్రం ర్యాంక్–1గా నిలిచింది.
Aliens కి బంగారు డిస్క్ లతో సందేశం
మొత్తం విశ్వంలో భూమ్మీద మాత్రమే జీవం ఉందా? సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపైనో.. ఇతర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాలపైనో ఏదైనా జీవం ఉందా అన్నది ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్న. ఈ గ్రహాంతర వాసుల (ఏలియన్లు) కోసం శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా ఏలియన్లు ఉంటే మనను గుర్తించేందుకు వీలుగా అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నళ్లు పంపడం వంటివీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రయోగాల్లో ప్రత్యేకమైన బంగారు డిస్‌్కలను పంపారు. ఏమిటా బంగారు డిస్కులు, వాటిపై ఏముందన్న వివరాలు తెలుసుకుందామా..
Also read: NASA DART Mission విజయవంతం
భూమి, మానవుల విశేషాలతో..
ఒకవేళ ఎక్కడైనా గ్రహాంతర జీవులు ఉండి ఉంటే.. వాటికి భూమి మీద జీవం, మనుషులు ఉన్నట్టు తెలిపేందుకు శాస్త్రవేత్తలు వ్యోమనౌకలలో ప్రత్యేకమైన బంగారు డిస్క్‌లను పంపారు. వాటిపై మనుషులు సాధించిన ప్రగతి, వివిధ సాంస్కృతిక, సాంకేతిక అంశాలను వివరించేలా ఉన్న డిజైన్లు, ఆకారాలను నిక్షిప్తం చేశారు. అయితే ఇవి పూర్తిస్థాయి బంగారు ప్లేట్లు కాదు. పన్నెండు అంగుళాల వ్యాసం ఉన్న గట్టి రాగి ప్లేట్లపై మందంగా బంగారు పూత పూశారు.
ఇప్పటివరకు నాలుగు వ్యోమనౌకలలో..
అంతరిక్షంలో సుదూర ప్రయోగాల కోసం పంపిన వ్యోమనౌకలలో నాసా శాస్త్రవేత్తలు బంగారు డిస్క్ లు అమర్చారు. ఇప్పటివరకు పయోనిర్–10, పయోనిర్–11, వోయేజర్–1, వోయేజర్–2 వ్యోమనౌకలు వీటిని తీసుకుని అంతరిక్షం అంచుల్లోకి చేరుకున్నాయి కూడా. వోయేజర్ వ్యోమనౌకల్లో పంపిన డిస్‌్కలపై పంపిన డేటాను శాస్త్రవేత్త కార్ల్ సాగన్ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది.
ఏలియన్లకు అర్థమయ్యేలా..
1977లో వోయేజర్ వ్యోమనౌకలలో పంపిన బంగారు డిస్క్‌లను గ్రామ్‌ఫోన్ రికార్డుల తరహాలో రూపొందించారు. వాటిలో గణితం, సైన్స్‌కు సంబంధించిన వివరాలను, వివిధ ధ్వనులను నమోదు చేశారు. గణితం, సైన్స్‌కు సంబంధించిన అంశాలు యూనివర్సల్ అని.. ఎప్పటికైనా వీటిని గ్రహాంతర వాసులు అర్థం చేసుకోగలరని శాస్త్రవేత్తల భావన. అందుకే ఈ డిస్క్ లను టైం క్యాప్సూల్స్ అని కూడా పేర్కొన్నారు.
ూఈ బంగారు డిస్‌్కలకుపైన కవర్ ను కూడా అమర్చారు. దీనిని అల్యూమినియంతో తయారు చేశారు. అంతరిక్షంలో పరిస్థితులను తట్టుకుని కోట్ల ఏళ్లు ఉండేందుకు వీలుగా.. యురేనియం–238ను పూత పూశారు. ఈ కవర్‌పై ‘‘అన్ని కాలాలు, అన్ని ప్రపంచాల్లో సంగీతాన్ని సృష్టించేవారి కోసం..’’ అని రాశారు.
బంగారు డిస్‌్కలలో ఏమేం నిక్షిప్తం చేశారు?
మానవులు, భూమికి సంబంధించి అనలాగ్ పద్ధతిలో ఎన్‌కోడ్ చేసిన 115 చిత్రాలు (తింటూ, తాగుతూ ఉన్న మనుషులు, తాజ్‌మహల్ వంటి ప్రముఖ స్థలాలు, క్రీడాకారులు,
గర్భిణులు, పాలిస్తున్న తల్లి, ఎల్రక్టానిక్ పరికరాలు, న్యూటన్ రాసిన బుక్‌లోని ఓ పేజీ.. ఇలా ఎన్నో).
హిందీ, బెంగాలీ, కన్నడ సహా 55 భాషల్లో పలకరింపులు.
ప్రముఖ సంగీత విద్వాంసులకు సంబంధించిన 90 నిమిషాల సంగీతం.
భూమిపై వినిపించే వివిధ రకాల ధ్వనులతో కూడిన (ఉరుములు,
జంతువుల అరుపులు, మనుషుల మాటలు, ముద్దు ధ్వని సహా) 12 నిమిషాల ఆడియో.
అంతరిక్షంలో మన సౌర కుటుంబం, భూమి ఉన్న
ప్రాంతాన్ని గుర్తించగలిగేలా డిస్క్ కవర్‌పై మ్యాప్.
డిస్క్‌లోని వివరాలను డీకోడ్ చేసేందుకు వీలైన మేథమేటికల్, సైన్స్ ఆకృతులు.
‘గొల్లభామ’కు UNESCO గుర్తింపుపై హరీశ్‌రావు హర్షం
చేనేత కార్మికుల వృత్తి కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే సిద్దిపేట బ్రాండ్ అంబాసిడర్ గొల్లభామ చీరకు యునెస్కో గుర్తింపు దక్కడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితమే భౌగోళిక (జియోగ్రాఫికల్) గుర్తింపు లభించగా తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా నేతన్నలను అభినందించారు. చీర ప్రత్యేకత, చరిత్ర గూర్చి వివరిస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలను ట్యాగ్ చేశారు. ఇటీవల భారతీయ సంప్రదాయక వస్త్రాల సంరక్షణపై యునెస్కో విడుదల చేసిన నివేదికలో సిద్దిపేట గొల్లభామ చీరకు చోటు లభించింది. తలమీద చల్ల కుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి(చిన్న మట్టి పాత్ర) పట్టుకొని, కాళ్లకు గజ్జెలు, కొప్పులో పువ్వులతో నడియాడే గొల్లభామ ప్రతిమలతో ఈ చీరను రూపొందిస్తారు.