S&P Rating : వర్ధమాన దేశాల్లో ‘స్టార్’ భారత్
Sakshi Education
ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ భారత్‌ను వర్ధమాన దేశాల్లోనే స్టార్ (ఆశాకిరణం)గా అభివర్ణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 7.3 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని అంచనా వేసింది.
పెరుగుతున్న వడ్డీ రేట్లు, యూరోప్‌లో పెరిగిపోయిన ఇంధన అభద్రత ప్రభావం ప్రతి దేశాన్ని తాకుతోందని.. ఈ తరుణంలో 7.3 శాతం వృద్ధితో భారత్ స్టార్‌గా నిలవనుందని వివరించింది. ఈ మేరకు సెప్టెంబర్ 29న ఒక నివేదికను విడుదల చేసింది. సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుతో కఠిన ఆర్థిక పరిస్థితుల కారణంగా, వచ్చే కొన్ని త్రైమాసికాల్లో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి నిదానిస్తుందని తెలిపింది. ‘‘ద్రవ్యోల్బణం గృహ ఆదాయాన్ని తగ్గించేసింది. వ్యాపార విశ్వాసం సైతం క్షీణించింది. వెలుపలి వాతావరణం కూడా మరింత క్లిష్టంగా మారింది’’అని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి కేంద్ర బ్యాంకులు దూకుడుగా వడ్డీ రేట్లను పెంచుతున్నాయని, అమెరికాలో స్వల్ప మాంద్యాన్ని అంచనా వేస్తున్నట్టు పేర్కొంది.
Published date : 30 Sep 2022 06:20PM