Skip to main content

Tourism Awards : తెలంగాణ, ఏపీకి 4 జాతీయ పర్యాటక అవార్డులు

పర్యాటక సమగ్ర అభివృద్ధిలో ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది.
Telangana bags four national tourism awards
Telangana bags four national tourism awards

అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జాతీయ పర్యాటక అవార్డుల(2018–19) ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కడ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి అవార్డులు అందించారు. తెలంగాణ 4, ఆంధ్రప్రదేశ్‌ 4 అవార్డులను కైవసం చేసుకున్నాయి. 

Also read: Weekly Current Affairs (Awards) Bitbank: మిస్ దివా యూనివర్స్ 2022 ప్రతిష్టాత్మక టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?

పర్యాటక, ఆతిథ్య రంగాల బలోపేతం..  
దేశీయ పర్యాటకాభివృద్ధి కోసం కేంద్రం చిత్తుశుద్ధితో కృషిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. న్యూ ఇండియా విజన్‌ నినాదంతో త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పన, పర్యాటక పరిశ్రమను వృద్ధి చేయడం, పర్యాటకానికి అనుబంధంగా ఉన్న రంగాలను ప్రోత్సహించడం, పబ్లిక్‌–ప్రైవేట్‌ భాగస్వామ్యానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం.. వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.     

Also read: World Tourism Day : థీమ్ - రీ థింకింగ్ టూరిజం

తెలంగాణకు అవార్డులు
1)    పర్యాటక సమగ్ర అభివృద్ధిలో మూడో ఉత్తమ రాష్ట్రం  
2)    బెస్ట్‌ టూరిస్ట్‌ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా సికింద్రాబాద్‌ 
3)    హైదరాబాద్‌లోని అపోలో హెల్త్‌ సిటీకి ‘బెస్ట్‌ మెడికల్‌ టూరిజం ఫెసిలిటీ’ 
4)    హైదరాబాద్‌ గోల్ఫ్‌ కోర్సుకు ఉత్తమ పర్యాటక గోల్ఫ్‌ కోర్స్‌ 

ఆంధ్రప్రదేశ్‌కు అవార్డులు 
1)    ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ అవార్డు 
2)    ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్‌ బుక్‌ ‘సీసైడ్‌’కు ఎక్సలెన్స్‌ ఇన్‌ పబ్లిషింగ్‌ ఇన్‌ ఇంగ్లిష్‌ అవార్డు 
3)    ఏపీ టూరిజం ప్రచురించిన కాఫీ టేబుల్‌ బుక్స్‌  ‘సీసైడ్‌’ (రష్యన్‌), హ్యాండ్‌క్రాఫ్టెడ్‌ ( స్పానిష్, జర్మన్‌)కు ఎక్సలెన్స్‌ ఇన్‌ పబ్లిషింగ్‌ ఇన్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ అవార్డు  
4)    విజయవాడలోని ‘ది గేట్‌వే హోటల్‌’కు బెస్ట్‌ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ అవార్డు  

Also read: Daily Current Affairs in Telugu: 2022, సెప్టెంబర్ 27th కరెంట్‌ అఫైర్స్‌

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 28 Sep 2022 06:31PM

Photo Stories