ISL Competitions లో TS కి 3 అవార్డులు
ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా రాష్ట్రానికి సమాచారం ఇచ్చారు. సెప్టెంబర్ 17న ఐఎస్‌ఎల్ పోటీని నిర్వహించగా, దేశంలోని 1,850 పట్టణాలు ఇందులో పాల్గొన్నాయి. వీటిలో తెలంగాణకు మూడు అవార్డులు రాగా, ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్ కింద వచ్చిన 16 అవార్డులతో కలిపి రాష్ట్రానికి మొత్తం 19 అవార్డులు దక్కినట్లయింది. ఐఎస్‌ఎల్ పోటీల్లో భాగంగా అన్ని పట్టణాలు తాము చేపట్టిన ఫ్లాగ్ రన్, పరిశుభ్రంగా మార్చిన ప్రదేశాలు, చారిత్రక, జియోగ్రాఫికల్ ప్రదేశాలు, ర్యాలీలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించారు.
మూడు కేటగిరీల్లో అవార్డులు
జనాభా ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా జరిగిన పోటీలో 15వేల లోపు జనాభా గల పట్టణాల కేటగిరీలో అలంపూర్ అవార్డుకు ఎంపికైంది. 25 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న పట్టణాల కేటగిరీలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, 50 వేల నుంచి లక్ష జనాభా ఉన్న కేటగిరీలో కోరుట్ల ఎంపికయ్యాయి. ఈ మూడు పట్టణాలకు సెప్టెంబర్ 30న ఢిల్లీలోని టల్కటోరా స్టేడియంలో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డులు పొందిన పీర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్ పురపాలికలకు మంత్రి కె.తారకరామారావు అభినందనలు తెలిపారు.
Also read: TS లోని 16 పురపాలికలకు Swach Sarveskhan Awards
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP