Skip to main content

TS లోని 16 పురపాలికలకు Swach Sarveskhan Awards

రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కింది. ఇవి స్వచ్ఛ సర్వేక్షణ్‌–22 అవార్డులను సాధించాయి.
Swach Sarveskhan Awards
Swach Sarveskhan Awards

జాతీయస్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ పారిశుధ్య సంబంధిత సమస్యల పరిష్కారాలను, చెత్తరహిత నగరాల(జీఎఫ్‌సీ)కు స్టార్‌ రేటింగ్‌ ఇచ్చి(జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు) ఈ అవార్డులకు ఎంపిక చేసింది. పారిశుధ్యం, పురపాలక ఘన వ్యర్థాల నిర్వహణ, ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహనకుగాను దేశవ్యాప్తంగా 4,355 పట్టణ, స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ నిర్వహించారు. ఈ పోటీల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన 16 పట్టణ, స్థానిక సంస్థలకు అవార్డులొచ్చాయి. వీటి ఎంపికకు 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకున్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, లిట్టర్‌ ఫ్రీ వాణిజ్యప్రాంతాలు, కమ్యూనిటీ లెవెల్‌ కంపోస్టింగ్, ప్రజా మరుగుదొడ్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, ప్రజల అవగాహన, సిటిజన్‌ ఎంగేజ్‌మెంట్, ఇన్నోవేషన్స్‌లో అవార్డులను ఎంపిక చేశారు. ఢిల్లీలో అక్టోబర్‌ 1న జరిగే స్వచ్ఛ మహోత్సవ్‌లో అవార్డులను అందజేస్తారు. ఈ అవార్డులతోపాటు రాష్ట్రంలోని 142 పట్టణ, స్థానిక సంస్థల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ 70 పట్టణ స్థానికసంస్థలను బహిరంగ మలవిసర్జన లేని (ఓడీఎఫ్‌+)గా, 40 పట్టణ స్థానిక సంస్థలను  ఓడీఎఫ్‌++గా, ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్‌+, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్‌ పట్టణాలుగా ప్రకటించారు.  

Also read: Telangana: సర్వ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌లో తెలంగాణ దేశంలోనే.. నంబర్‌ వన్‌

అవార్డులు సాధించిన మున్సిపాలిటీలివే.. 
ఆదిభట్ల, బడంగ్‌పేట్, భూత్పూర్, చండూర్, చిట్యాల, గజ్వేల్, ఘట్‌కేసర్, హుస్నాబాద్, కొంపల్లి, కోరుట్ల, కొత్తపల్లి, నేరేడుచర్ల, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, సిరిసిల్ల, తుర్కయాంజాల్, వేములవాడ.  
 

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 26 Sep 2022 07:38PM

Photo Stories