Skip to main content

World's most liveable city: భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరం ఏదంటే..

Vienna named world's most liveable city
Vienna named world's most liveable city

భూమ్మీద అత్యంత నివాసయోగ్య నగరంగా ఆస్ట్రియా రాజధాని వియన్నా నిలిచింది. జీవన ప్రమాణాల్లో సుస్థిరత, మౌలిక సదుపాయాలు, మంచి ఆరోగ్య వ్యవస్థ, విస్తృతమైన ఉపాధి అవకాశాలు, వినోదం–విజ్ఞానం–సంస్కృతి తదితర ప్రామాణికాల ఆధారంగా ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈయూఐ) ఏటా ఈ ర్యాంకులిస్తుంది. గతేడాది టాప్‌లో ఉన్న అక్లండ్‌ (న్యూజిలాండ్‌)ను తోసిరాజని వియన్నా తొలి స్థానంలోకి వచ్చినట్టు ఎకనామిస్ట్‌ పత్రిక ప్రచురించింది. కరోనా దెబ్బకు ఆక్లండ్‌ 34వ స్థానానికి పడిపోయింది. వియన్నా గతంలో 2018, 2019 ల్లోనూ తొలి స్థానంలో నిలిచింది. కరో నా వచ్చిన కొత్తల్లో రెస్టారెంట్లు, మ్యూజియంలు తదితరాలన్నీ మూతబడటంతో 2020లో 12వ స్థానానికి పడిపోయింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈసారి మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హగెన్‌ రెండో స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యురిచ్, కెనడాలోని కేల్గరీ నగరాలు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. పారిస్‌ 19 స్థానంలో, లండన్‌ 33, మిలన్‌ (ఇటలీ) 49, న్యూయార్క్‌ 51వ స్థానంలో నిలిచాయి.

Also read: GSAT-24 satellite : జీశాట్‌–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

టాప్‌ 10 నగరాలు 
1. వియన్నా (ఆ్రస్టియా) 
2. కోపెన్‌హగెన్‌ (డెన్మార్క్‌) 
3. జ్యురిచ్‌ (స్విట్జర్లాండ్‌) 
4. కాల్గరీ (కెనడా) 
5. వాంకోవర్‌ (కెనడా) 
6. జెనీవా (స్విట్జర్లాండ్‌) 
7. ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ) 
8. టొరంటో (కెనడా) 
9. ఆమ్‌స్టర్‌డామ్‌ (నెదర్లాండ్స్‌) 
10. ఒసాకా (జపాన్‌) 
  //    మెల్‌బోర్న్‌ (ఆస్ట్రేలియా)  

Published date : 24 Jun 2022 04:35PM

Photo Stories