Telangana: సర్వ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో తెలంగాణ దేశంలోనే.. నంబర్ వన్
ఎస్‌ఎస్‌జీకి సంబంధించిన పలు కేటగిరీల్లో టాప్–3 ర్యాంకుల్లో నిలిచింది.
మొత్తం 13 స్వచ్ఛ అవార్డులు సాధించి సత్తా చాటింది. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులు అందజేస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ వికాస్ శీల్ రాష్ట్రానికి లేఖ రాశారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలుస్తోందని ప్రశంసించారు.
వీటితో పాటు వాల్ పెయింటింగ్ కాంపిటీషన్ ఓడీఎఫ్ ప్లస్ బయో డిగ్రేడబుల్ వ్యర్ధాల నిర్వహణ, గోబర్ ధాన్, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ, మురుగు నీటి నిర్వహణ, బహిరంగ మల విసర్జన (ఓడీఎఫ్) నిర్వహణ వంటి కేటగిరీల అవార్డులలో సౌత్‌జోన్‌లో తెలంగాణ మొదటి ర్యాంకులు సాధించింది.
గతంలోనూ స్వచ్ఛ, పారిశుధ్య, ఇ– పంచాయతీ, ఉత్తమ గ్రామ పంచాయతీలు, ఉత్తమ ఆడిటింగ్ వంటి అంశాలతో పాటు 100 శాతం నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తున్న రాష్ట్రంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. ఏటా నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛత, పరిశుభ్రతపై సర్వే (ఎస్‌ఎస్‌జీ) నిర్వహించి ఆ మేరకు కేంద్రం అవార్డులు అందజేస్తోంది.