Skip to main content

క్యాన్సర్‌ కణితి పెరుగుదలను పర్యవేక్షించే పరిక‌రాన్ని ఎవ‌రు క‌నుగొన్నారు..?

A flexible electronic strain sensor for the real time monitoring of tumor regression

క్యాన్సర్‌ కణితి పెరుగుదలను పర్యవేక్షించే బుల్లి పరికరాన్ని స్టాన్‌ ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిపేరు ఫ్లెక్సిబుల్‌ అటానమస్‌ సెన్సర్‌ మెజరింగ్‌ ట్యూమర్స్‌(ఫాస్ట్‌). చర్మానికి ఇట్టే అతుక్కోవడంతోపాటు, శరీర కదలికలకు అనుగుణంగా సాగేలా ఇందులో సెన్సర్లను అమర్చారు. బ్యాటరీ ఆధారంగా పనిచేసే ఈ పరికరం మిల్లీమీటరులో వందో వంతు పరిమాణంలో మార్పులు చోటుచేసుకున్నా ఇట్టే గుర్తిస్తుంది. కణితిలో ఏ చిన్న మార్పు వచ్చినా వెంటనే స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ కు సమాచారం చేరవేస్తుంది. తద్వారా క్యాన్సర్‌ ఔషధాలు, చికిత్సల పనితీరును మరింత వేగంగా, కచ్చితంగా తెలుసుకోవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 03 Oct 2022 06:09PM

Photo Stories