European researchers: ఊదా రంగు టమాటాకు అమెరికా ఆమోదం
Sakshi Education
జన్యు మార్పిడి చేసిన ఊదా రంగు టమాటాల పెంపకానికి అమెరికా ఆమోదం తెలిపింది. 2008లో యూరోపియన్ పరిశోధకులు డ్రాగన్ పుష్పాల జీన్స్‌ను టమాటాలో ప్రవేశపెట్టి వీటిని సృష్టించారు. వీటిలో క్యాన్సర్ వ్యాధిని నిరోధించే ఆంతోసయానిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ టమాటాలు చూడగానే నల్ల వంకాయల్లా కనిపిస్తాయి. ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్ పరిశోధకులు సృష్టించిన ఈ జన్యుమార్పిడి(జీఎంవో) పంటను తమ దేశంలో పండించేందుకు మొదట అమెరికా వ్యవసాయ శాఖ ఒప్పుకోలేదు. 14ఏళ్ల తర్వాత ఎట్టకేలకు అంగీకరించింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 03 Oct 2022 05:25PM