Chief of Defence Staff గా చౌహాన్
ఆయన సైనిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కూడా కొనసాగుతారని పేర్కొంది. జనరల్ హోదాలో చౌహాన్ బాధ్యతలు స్వీకరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. లెఫ్టినెంట్ జనరల్‌గా రిటైరయ్యాక జనరల్‌గా పదోన్నతిపై తిరిగి విధుల్లో చేరనున్న తొలి సైనికాధికారి ఆయనే. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం నేపథ్యంలో 9 నెలలకు పైగా సీడీఎస్ పదవి ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే.
1961లో జన్మించిన చౌహాన్ నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో శిక్షణ అనంతరం 1981లో 11, గూర్ఖా రైఫిల్స్‌లో చేరారు. కశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లో చొరబాట్ల నిరోధక కార్యకలాపాల్లో ఆయనకు సుదీర్ఘ అనుభవముంది. అంగోలాలో ఐరాస మిషన్‌లోనూ సేవలందించారు. 2019లో పుల్వామా ఉగ్ర దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌పై వాయుసేన దాడుల సందర్భంగా మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఈ హోదాలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2021 మేలో తూర్పు ఆర్మీ కమాండర్‌గా రిటైరయ్యారు. పరమ విశిష్ట సేవా మెడల్, ఉత్తమ యుద్ధ సేవా మెడల్, అతి విశిష్ట సేవా మెడల్, సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. చైనా వ్యవహారాలపై నిపుణుడిగా చౌహాన్‌కు పేరుంది. ప్రస్తుతం ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సారథ్యంలోని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్‌లో సైనిక సలహాదారుగా సేవలందిస్తున్నారు. త్రివిధ దళాలను మరింతగా సంఘటితపరిచి దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింపజేసే లక్ష్యంతో సీడీఎస్ పదవిని కేంద్రం తెరపైకి తెచ్చింది.
తొలి సీడీఎస్‌గా జనరల్ రావత్ 2020 జనవరి 1న బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. త్రివిధ దళాల చీఫ్‌గా రిటైరైన వారితో పాటు లెఫ్టినెంట్ జనరల్, ఎయిర్ మార్షల్, వైస్ అడ్మిరల్‌గా రిటైరైన వాళ్లకు కూడా సీడీఎస్ అయ్యేందుకు అర్హత కల్పిస్తూ జూన్‌లో నిబంధనలను మార్చారు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP