PM Modi: న్యూజిలాండ్ ప్రధానితో ప్రధాని నరేంద్ర మోదీ బేటీ
పపువా న్యూ గినియా(Papua New Guinea)లో నిర్వహించిన ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్(FIPIC) మూడవ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడి నుంచి న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లారు.
ఇండియా, న్యూజిలాండ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు ఇరుదేశాలు కలిసి సంయుక్తంగా ముందుకుసాగాలని ఈ సందర్భంగా ఇరుదేశాధినేతలు ఒక నిర్ణయానికి వచ్చారు.
☛➤☛ వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (23-29 ఏప్రిల్ 2023)
జనవరిలో హిప్కిన్స్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరువురు ప్రధానుల మధ్య జరిగిన తొలి సమావేశం ఇదే.
న్యూజిలాండ్ ప్రధానితో అద్భుతమైన సమావేశం జరిగిందని, భారత్-న్యూజిలాండ్ సంబంధాలపై పూర్తి స్థాయిలో చర్చించానని న్యూజిలాండ్ ప్రధానితో బేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై చర్చించామని వివరించారు.