IPS Anukriti Sharma: నాలుగో ప్రయత్నంలోనే ఐపీఎస్... ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్... నా సక్సెస్ జర్నీ ఇదే
2020 బ్యాచ్‌కు చెందిన అనుకృతి శర్మ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీస్ క్యాడర్‌లో పని చేస్తోంది. అక్కడి బులంద్‌షహర్‌లో అడిషనల్ ఎస్పీగా సేవలందిస్తోన్న ఆమెకు.. తన వద్దకొచ్చిన ఫిర్యాదులకు వేగంగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటుందన్న మంచి పేరుంది. దాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు అనుకృతి.
చదవండి: ఆల్ ఇండియా సివిల్స్ టాపర్ ఈ కలెక్టర్... సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి హైదరబాద్ కలెక్టర్‌గా
బులంద్‌షహర్‌కు దగ్గర్లోని ఓ గ్రామంలో నూర్జహాన్ అనే 70 ఏళ్ల వృద్ధురాలు దశాబ్దాలుగా నివాసముంటోంది. కొన్నేళ్ల క్రితమే భర్తను కోల్పోయిన ఆమె.. గతేడాది తన కూతురికి వివాహం చేసి అత్తారింటికి పంపించింది. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటోన్న నూర్జహాన్ ఇంట్లో కరెంట్ లేక దశాబ్దాలవుతోంది. రాత్రయ్యిందంటే దీపంతోనే సర్దుకుపోవాలి. అలాగని కరెంట్ కనెక్షన్ కూడా తీసుకోలేని కడు పేదరికం.. మరోవైపు వృద్ధాప్యం!
ఇలాంటి పరిస్థితుల నడుమ ఉన్న నూర్జహాన్.. ఈమధ్యే తన ఫిర్యాదును ఆ నగర ఏఎస్పీ అనుకృతి దృష్టికి తీసుకెళ్లింది. ఎప్పటిలాగే వెంటనే స్పందించిన ఆమె.. పోలీసు నిధులతో, విద్యుత్ అధికారుల చొరవతో ఇటీవలే ఆ అవ్వ ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇప్పించారు. తన బృందంతో కలిసి వెళ్లి నూర్జహాన్ ఇంట్లో వెలుగులు నింపారు.
కుటుంబ నేపథ్యం...
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో పుట్టి పెరిగిన అనుకృతి తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వోద్యోగులే. క్రమశిక్షణ, ఉన్నత విలువల మధ్య పెరిగిన ఆమె.. తన పేరెంట్స్ స్ఫూర్తితో చిన్నతనం నుంచి చదువులో మెరుగ్గా రాణించేది. 2007లో ఐఐటీ జేఈఈలో ఉత్తీర్ణత సాధించి కోల్‌కతాలోని Indian Institute of Science Education and Research లో జాయిన్ అయ్యింది.
☛ UPSC topper Ishita Kishore’s marks: అదరగొట్టిన యూపీఎస్సీ టాపర్ ఇషితా కిషోర్... ఆమెకు వచ్చిన మార్కులు ఎన్నంటే...
గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అమెరికాలోని రైస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే ప్రభుత్వోద్యోగి అయి దేశ ప్రజలకు సేవ చేయాలనే బలమైన కోరిక ఆమెకు ఉండేది. తన కలను నెరవేర్చుకోవడానికి ఇండియాకు తిరిగి వచ్చారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో, భర్త సహకారంతో ఆమె యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష వైపు అడుగులు వేశారు.
తొలి ప్రయత్నంలో అనుకృతి ప్రిలిమ్స్ క్లియర్ చేసింది. కానీ, మెయిన్స్‌లో విఫలమైంది. రెండో ప్రయత్నంలో ప్రిలిమ్స్ దశలోనే ఫెయిలైంది. విజయం సాధించాలనే బలమైన సంకల్పంతో శర్మ తన మూడవ ప్రయత్నం మొదలు పెట్టింది. 2019లో ఆలిండియా 355 వ ర్యాంకు సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) కు ఎంపికైంది. మళ్లీ యూపీఎస్సీ పరీక్ష రాసి 2020లో ఆలిండియా 138వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌గా ఎంపికైంది.
☛ జీవితంలో ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దు... వరుసగా 35 సార్లు ఫెయిల్... చివరికి ఐఏఎస్ సాధించానిలా
ప్రస్తుతం బులంద్‌షహర్ ఏఎస్పీగా అనుకృతి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బాల్యవివాహాలు, గృహ హింస పేరుతో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేస్తూ.. బాలికలకు, మహిళలకు రక్షణ కల్పించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ‘పోలీస్ మై ఫ్రెండ్’ అనే కార్యక్రమానికి తెర తీశారు. తద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో బాల్యవివాహాలు, గృహ హింస రేటు తగ్గడంలో కీలక పాత్ర పోషించారీ ఐపీఎస్ అధికారిణి.