Skip to main content

MRF founder Mappilla success story: బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి.. వేల కోట్ల కంపెనీ నిర్మించిన ఎంఆర్ఎఫ్ ఫౌండ‌ర్‌ మామెన్ స‌క్సెస్ జ‌ర్నీ

భారతీయ స్టాక్‌మార్కెట్‌ చరిత్రలో ఆటోమొబైల్ టైర్ దిగ్గ‌జం ఎంఆర్‌ఎఫ్ స్టాక్‌ మరో సారి తన ప్రత్యేకతను చాటుకుంది, టైర్ పరిశ్రమలో అగ్రస్థానంలో ఉన్న ఎంఆర్‌ఎఫ్‌ షేరు (జూన్‌ 13, 2023)న తొలిసారి లక్ష రూపాయ‌ల‌ మార్క్‌ను టచ్‌ చేసింది. ఈ ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్‌గా రికార్డు క్రియేట్‌ చేసింది.
K. M. Mammen Mappillai
K. M. Mammen Mappillai

ఎంఆర్ఎఫ్‌ కంపెనీ ఫౌండర్ ఎవరు?  ఈ కంపెనీ విజయ ప్రస్థానం ఏంటి? ఒకసారి చూద్దాం. 

Rajinder Gupta: రోజుకు రూ.30తో ప్రారంభించి... నేడు రూ.12 వేల కోట్ల‌కు అధిప‌తి... రాజేంద‌ర్ గుప్తా స‌క్సెస్ జ‌ర్నీ..!

ఎంఆర్‌ఎఫ్‌ అంటే  మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. దేశంలోని అతిపెద్ద టైర్ కంపెని  ఫౌండర్ కేఎం మామ్మెన్ మాప్పిళ్లై. ఆయన అంకితభావం, కృషి  పట్టదలతో ఈ రోజు  ఈ స్థాయికి ఎగిసింది కంపెనీ. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు 1946లో కేఎం మమ్మెన్ మాప్పిళ్ళై మద్రాసు వీధుల్లో బెలూన్లు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచారు. తొమ్మిది మంది తోబుట్టువులతో, కేరళలో సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన మమ్మన్‌కు ఈ  బెలూన్ల వ్యాపారమే తన విజయానికి సోపానమని ఊహించి ఉండరు. 

mrf

మామెన్ తండ్రి స్వాతంత్య్ర సమరయోధుడు. మామెన్‌ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్నాడు. ఆ సమయంలో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొంటున్న త‌న‌ తండ్రిని రెండేళ్ల పాటు జైలులో ఉంచారు. దీంతో కుటుంబ భారం మామెన్‌పై ప‌డింది. బొమ్మల బెలూన్‌లను తయారీ చేసి, వాటిని విక్ర‌యించ‌గా వ‌చ్చిన డ‌బ్బుల‌తో కుటుంబం గడిచేది. అలా  6 ఏళ్ల‌ పాటు ఆయ‌న బొమ్మ‌ల బెలూన్లు త‌యారు చేశారు. 1952.. ఆయ‌న జీవితాన్ని మ‌లుపు తిప్పింది. ఓ విదేశీ కంపెనీ మ‌న దేశంలోని ఒక‌ టైర్ రీ ట్రేడింగ్ ప్లాంట్‌కు ట్రెడ్ రబ్బర్ సరఫరా చేస్తోందని మామెన్ గమనించారు. తాను కూడా రబ్బరు వ్యాపారంలోకి అడుగు పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. 

Kanhaiya Sharma Success Story: 2.5 కోట్ల వేత‌నాన్ని వ‌దిలేసి... సొంతంగా స్టార్ట‌ప్ స్థాపించి... 23 ఏళ్ల‌కే కోట్ల‌కు అధిప‌తి అయిన క‌న్హ‌య్య శ‌ర్మ స‌క్సెస్ జ‌ర్నీ

తర్వాత మద్రాసులోని చీటా స్ట్రీట్‌లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించారు. 1956 నాటికి రబ్బరు వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంది మామెన్ కంపెనీ. నాలుగేళ్లలో మార్కెట్ వాటా 50 శాతానికి చేరుకుంది. ఫ‌లితంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు భారత మర్కెట్ నుంచి తప్పుకున్నాయి. అయితే  మామెన్ ఇక్కడితో ఆగలేదు టైర్ల తయారీ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. 

దీంతో  రబ్బరు ఉత్పత్తులనుంచి టైర్ పరిశ్రమలోకి మారారు. 1960లో రబ్బర్, టైర్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. అలా అమెరికాకు చెందిన మాన్స్‌ఫీల్డ్ టైర్, రబ్బర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్‌ఎఫ్‌)గా  ఆవిష్కరించింది. ట్రెడ్స్, ట్యూబ్‌లు, పెయింట్స్, బెల్ట్‌లు, బొమ్మలు వంటి అనేక ఇతర ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. 1961లో మద్రాస్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో  లిస్ట్‌ అయింది.

Ananth Narayanan success story: మింత్రా సీఈఓ ప‌ద‌విని వ‌దిలేసి... ఆరు నెలల్లోనే 10 వేల‌ కోట్ల బిజినెస్‌ను స్థాపించిన అనంత్ స‌క్సెస్ జ‌ర్నీ

mrf

1967లో ఎంఆర్ఎఫ్‌ కంపెనీ అమెరికాకు టైర్లను ఎగుమతి చేసింది. దేశంలో ఈ ఘ‌న‌త సాధించిన‌ మొట్ట మొదటి కంపెనీగా అవతరించింది. దీంతో దేశంలోని వివిధ ప్రదేశాలలో ప్లాంట్‌లను ప్రారంభించింది. 1973లో దేశంలో నైలాన్ ట్రావెల్ కారును వాణిజ్యపరంగా తయారు చేసి మార్కెట్ చేసిన తొలి కంపెనీగా అవతరించింది. అలా 1979 నాటికి కంపెనీ పేరు కంపెనీ పేరు విదేశాలకు ఎగబాకింది. ఆ తరువాత అమెరికన్ కంపెనీ మాన్స్‌ఫీల్డ్ సంస్థలో తన వాటాను విక్రయించడంతో ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్‌గా మారింది.  

అంతా బాగానే ఉంది. కానీ, మాన్స్‌ఫీల్డ్ టెక్నాలజీ భారతీయ రహదారి పరిస్థితులకు తగినది కాదని మామెన్ గ్రహించాడు. మరోవైపు డన్‌లప్, ఫైర్‌స్టోన్,గుడ్‌ఇయర్ వంటి బహుళజాతి కంపెనీల ఆధిపత్యంతో నిలదొక్కుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సొంతంగా,భారతీయ రోడ్లకు అనుగుణం టైర్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టిన మామెన్‌ ప్రభుత్వ  సాయంతో  1963లో తిరువొత్తియూర్‌లోని రబ్బరు పరిశోధనా కేంద్రం తిరువొత్తియూర్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. 

☛➤☛ జీవితంలో ఓట‌మిని ఎప్పుడూ ఒప్పుకోవ‌ద్దు... వ‌రుస‌గా 35 సార్లు ఫెయిల్‌... చివ‌రికి ఐఏఎస్ సాధించానిలా

అంతేకాదు  మార్కెటింగ్‌పై దృష్టి పెట్టారు.  అనేక పరిశోధనల తర్వాత, ధృఢమైన మన్నికైన టైర్లకు ప్రతిరూపంగా  అలిక్ పదమ్సీ  ఐకానిక్‌  పవర్‌ఫుల్‌ ఎంఆర్‌ఎఫ్‌ మజిల్‌ మేన్‌  చిత్రం వచ్చింది. భారతీయ ప్రకటనల ముఖచిత్రాన్ని మార్చివేసి 1964లో మజిల్‌మేన్‌  జనాన్ని విపరీతంగా ఆకర్షించింది. టీవీ వాణిజ్య ప్రకటనలు, బిల్‌బోర్డ్‌లలో ఇలా ఎక్కడ చూసినా ఈ పిక్‌ దర్శనమిచ్చింది.

సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా మొదలు విరాట్ కోహ్లీ వరకు పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. 80 ఏళ్ల వయసులో 2003లో మాప్పిళ్ళై కన్నుమూశారు. అనంతరం అతని కుమారులు వ్యాపారాన్ని చేపట్టారు. 1992లో మాప్పిళ్లై పరిశ్రమకు చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డును అందుకున్నారు . 

☛➤☛ ఫ‌స్ట్ అటెంప్ట్‌లో ఫెయిల్‌.. రెండో ప్ర‌య‌త్నంలో 36 ల‌క్ష‌ల మందిని వెన‌క్కినెట్టి ఫ‌స్ట్ ప్లేస్‌లో నిలిచిన రాజ‌స్థాన్ కుర్రాడు

ఈ ఏడాది కంపెనీ ఆదాయం రూ. 23,261.17 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఇది రూ. 19,633.71 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభం రూ.768.96 కోట్లుగా నమోదైంది. ఎంఆర్‌ఎఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.42,000 కోట్లు.

Published date : 14 Jun 2023 01:37PM

Photo Stories