Skip to main content

Kanhaiya Sharma Success Story: 2.5 కోట్ల వేత‌నాన్ని వ‌దిలేసి... సొంతంగా స్టార్ట‌ప్ స్థాపించి... 23 ఏళ్ల‌కే కోట్ల‌కు అధిప‌తి అయిన క‌న్హ‌య్య శ‌ర్మ స‌క్సెస్ జ‌ర్నీ

ప్రస్తుతం మొబైల్ ఫోన్ లేకుండా పెద్దవారికైనా, పిల్లలకైనా రోజు గడవదు అంటే అందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. పెద్దవారి సంగతి అలా ఉంచితే, పిల్లలు పుస్తకాల్లో కంటే మొబైల్, ఇంటర్నెట్, కంప్యూటర్లలోనే ఎక్కువ కాలం గడిపేస్తున్నారు.
Kanhaiya Sharma
Kanhaiya Sharma

ఇది తల్లిదండ్రులకు ఆందోళనగా మారిపోతోంది. అయితే అందుకు భిన్నంగా 'కన్హయ శర్మ' అనే యువకుడు చిన్నప్పుడే అద్భుతాలు సృష్టించి ప్రపంచ వ్యాప్తంగా హ్యాకింగ్‌లో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఇంతకీ ఇతడెవారు? ఇప్పుడేం చేస్తున్నాడు? అనే మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Rajesh Mehta success story: 1200 అప్పు తీసుకుని.... 2.5 ల‌క్ష‌ల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజేష్ మెహ‌తా స‌క్సెస్ జ‌ర్నీ

hack

మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన 'కన్హయ శర్మ' కేవలం 14 ఏళ్ల వయసులోనే ఒక సాఫ్ట్‌వేర్‌ క్రియేట్ చేసి రూ. 50వేలకు విక్రయించాడు. ప్రస్తుతం దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలో గొప్ప హ్యాకర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

Ananth Narayanan success story: మింత్రా సీఈఓ ప‌ద‌విని వ‌దిలేసి... ఆరు నెలల్లోనే 10 వేల‌ కోట్ల బిజినెస్‌ను స్థాపించిన అనంత్ స‌క్సెస్ జ‌ర్నీ

కన్హయ శర్మ తండ్రి ఇండోర్ నగరంలో ఉపాధ్యాయ వృత్తిలో తమ కుటుంబాన్ని పోషించేవాడు. కానీ కన్హయ శర్మ తన చిన్నతనంలోనే కేవలం రూ. 251తో ప్రారంభమైన ఇప్పుడు ఐటీ అండ్ లీగల్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కంపెనీలను స్థాపించి ఇప్పుడు కోట్లలో టర్నోవర్ చేస్తున్నాడు.  

legal

నిజానికి కన్హయ శర్మ ఇండోర్‌లోని సరాఫా విద్యా నికేతన్‌లో 8వ తరగతి చదువుతున్నప్పుడు పాఠశాలలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఆ నిర్మాణ పనులకు అవసరమయ్యే సామాగ్రి కోసం కూలీలు ఎంతగానో కష్టపడేవారు. ఇది చూసి కన్హయ ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ కనిపెట్టాలని నిర్ణయించుకుని 30 రోజుల్లోనే అనుకున్న విధంగానే సాఫ్ట్‌వేర్‌ కనిపెట్టాడు. దానిని సంస్థ వారికి యాభైవేల రూపాయలకు విక్రయించాడు. ఇప్పటికీ వారు సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తుండటం గమనార్హం.

Sandeep Aggrawal Success Story: భార్య‌తో విడాకులు... ఆపై జైలు జీవితం... ఈ రెండే వేల కోట్లు సంపాద‌న దిశ‌గా తీసుకెళ్లాయి..

తాను 6, 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రపంచంతో చాలా సంబంధాలు ఉండేవని, కానీ ఏడో తరగతిలో ఆన్‌లైన్ సర్టిఫికేషన్ పరీక్షలో ఫెయిల్ అయ్యానని కన్హయ తెలిపారు. అయితే ప్రస్తుతం న్యాయ సేవలకు ఐటీ సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని అందించే కంపెనీలను ప్రారంభించినట్లు కూడా తెలిపాడు. 

hack

కన్హయ శర్మ చదువుకునే రోజుల్లో తమ ఇంట్లో కేవలం ఒక సైకిల్ మాత్రమే ఉండేదని, ఇప్పుడు 5 నుంచి 6 లగ్జరీ కార్లు ఉన్నాయని వెల్లడించాడు. అంతే కాకుండా తనకు దేశంలోని ప్రభుత్వ సంస్థలతో అనుబంధం కలిగి ఉన్నట్లు, అక్కడి అధికారులకు, విద్యార్థులకు తానే ట్రైనింగ్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

☛ Anubhav Dubey: ఐఏఎస్ కావాల‌నుకున్నాడు... ఇప్పుడు టీ అమ్ముతూ 150 కోట్లు సంపాదిస్తున్నాడు... 20 ఏళ్ల‌కే షుగ‌ర్ రావ‌డంతో

కన్హయ శర్మ హ్యాకింగ్ నైపుణ్యాలను చూసి దేశవ్యాప్తంగా అనేక పెద్ద ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు అతనితో చేరడానికి 2.5 కోట్ల వార్షిక ప్యాకేజీ ఆఫర్ చేసినప్పటికీ వాటిని కన్హయ తిరస్కరించారు. ప్రస్తుతం ఇతడు వాప్‌గో అండ్ లీగల్251 వ్యవస్థాపకుడు & CEOగా ఉన్నట్లు సమాచారం. 

Published date : 10 Jun 2023 06:33PM

Photo Stories