Skip to main content

Rajesh Mehta success story: 1200 అప్పు తీసుకుని.... 2.5 ల‌క్ష‌ల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజేష్ మెహ‌తా స‌క్సెస్ జ‌ర్నీ

సాధించాలనే పట్టుదల ఉండాలే గానీ.. జీవితంలో పైకి రావాలనే కోరిక నెరవేర్చుకోవడం సాధ్యమే. అయితే ఈ పయనంలో కష్టాలు, కన్నీళ్లు ఉండొచ్చు గానీ, అనుకున్న గోల్‌ రీచ్‌ అయిన ఫీలింగ్‌.. సక్సెస్‌ కిక్కే వేరప్పా అనేలా చేస్తుంది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ బాస్‌ రాజేష్ మెహతా స్టోరీ కూడా అలాంటిదే.
Rajesh Mehta
Rajesh Mehta

రాజేష్ మెహతా బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్. బ్యాంకులో పనిచేసే తన సోదరుడు బిపిన్ వద్ద రూ.1200 అప్పు తీసుకుని చిన్నగా  సిల్వర్‌ ఆభరణాల వ్యాపారాన్నిప్రారంబించారు.చెన్నై నుంచి నగలు కొనుగోలు చేసి రాజ్‌కోట్‌లో విక్రయించేవారు. ఆ తర్వాత గుజరాత్‌లోని హోల్‌సేల్ వ్యాపారులకు ఆభరణాలను  అ‍మ్మేవారు. అలా అంచెలంచెలుగా ఎదిగి రూ. 2.5 లక్షల కోట్లతో సంస్థను  పరుగులు పెట్టిస్తున్నారు. 

Ananth Narayanan success story: మింత్రా సీఈఓ ప‌ద‌విని వ‌దిలేసి... ఆరు నెలల్లోనే 10 వేల‌ కోట్ల బిజినెస్‌ను స్థాపించిన అనంత్ స‌క్సెస్ జ‌ర్నీ

rajesh mehata

రాజేష్ మెహతా 20 జూన్ 1964న బెంగళూరులో  జస్వంతరాయ్ మెహతా, చంద్రికా బెన్ మెహతా దంపతులకు జన్మించాడు. తండ్రి 1946లో మోర్బి (గుజరాత్) నుంచి బెంగళూరుకు వలస వచ్చి ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేశాడు. తర్వాత ఉద్యోగం మానేసి గుజరాత్‌లో ‘రాజేష్ డైమండ్ కంపెనీ’ పేరుతో  చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. అలా డాక్టరు కావాలనుకున్న రాజేష్‌ తండ్రి నగల వ్యాపారంలోకి ప్రవేశించారు. అప్పు చేసి మరీ వ్యాపారాన్ని ప్రారంభించడమే కాదు ‘రాజేష్ ఆర్ట్ జ్యువెలర్స్’ అనే సంస్థ ద్వారా చిన్న వ్యాపారాన్ని  మొదలుపెట్టారు. 

Sandeep Aggrawal Success Story: భార్య‌తో విడాకులు... ఆపై జైలు జీవితం... ఈ రెండే వేల కోట్లు సంపాద‌న దిశ‌గా తీసుకెళ్లాయి..

rajesh mehata

మెహతా తన సోదరుడు ప్రశాంత్ మెహతాతో కలిసి 1989లో రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ని స్థాపించారు. బెంగళూరులోని తన గ్యారేజీలో  1991లో, ఆభరణాల రంగంలో దేశీయంగా తొలి పరిశోధన అభివృద్ధి , తయారీ యూనిట్‌ను  స్థాపించారు. యూకే దుబాయ్, ఒమన్, కువైట్, అమెరికా, యూరోప్‌లకు బంగారం ఎగుమతి చేయడం ప్రారంభించాడు.  రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ప్రపంచంలోని 35 శాతం బంగారాన్ని ప్రాసెస్ చేస్తుంది. క్రమంగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో  లిస్ట్‌ అయింది. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఫార్చ్యూన్ 500 జాబితాలో 423వ కంపెనీగా  అవతరించింది.

Vedant Lamba Success Story: 20 వేల‌తో ప్రారంభించి... వంద‌ల కోట్ల సంపాద‌న‌... వేదాంత్‌లంబా స‌క్సెస్ జ‌ర్నీ

rajesh mehata

1992 నాటికి బిజినెస్‌ ఏడాదికి 2 కోట్ల రూపాయల స్థాయికి పెరిగింది. 1998 నాటికి, వ్యాపారం మరింత పుంజుకుని ఏకంగా 1200 కోట్లకు చేరింది. అనంతరం శుభ్ జ్యువెలర్స్ పేరుతో ఓ దుకాణాన్ని ప్రారంభించాడు. కంపెనీకి ఇప్పుడు కర్నాటక అంతటా  స్టోర్‌లతో వ్యాపారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు.తర్వాత బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించారు. కంపెనీ జూలై 2015లో ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం ఎగుమతిదారు స్విస్ రిఫైన్డ్ వాల్‌కాంబిని  400 మిలియన్‌ డార్లతో కొనుగోలు చేసింది. ఈ కంపెనీకి  స్విట్జర్లాండ్ , భారతదేశంలో రిఫైనరీలు కూడా ఉన్నాయి. 

Minu Margeret Success Story : త‌క్కువ పెట్టుబ‌డి.. రూ.100 కోట్ల ఆదాయం.. కేవలం 18 నెలల్లోనే.. ఎలా అంటే..?

rajesh mehata

2019లో, ఫోర్బ్స్  రాజేష్‌ మెహతా నికర విలువ 1.57 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దీని  ప్రకారం ప్రస్తుతం కంపెనీ విలువ రూ. 12950 కోట్లు. 2021 నాటికి  ఈ కంపెనీ ఆదాయం రూ.2.58 లక్షల కోట్లు. కంపెనీ భారతదేశం, స్విట్జర్లాండ్ , దుబాయ్  బంగారు ఆభరణాలు, బంగారు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. కంపెనీ 60 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. రాజేష్‌ కుమారుడు సిద్ధార్థ్ మెహతా రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ బెంగుళూరులో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ టీమ్‌కు  హెడ్‌గా ఉన్నాడు.

☛ Anubhav Dubey: ఐఏఎస్ కావాల‌నుకున్నాడు... ఇప్పుడు టీ అమ్ముతూ 150 కోట్లు సంపాదిస్తున్నాడు... 20 ఏళ్ల‌కే షుగ‌ర్ రావ‌డంతో

Published date : 09 Jun 2023 05:41PM

Photo Stories