Skip to main content

Rajinder Gupta: రోజుకు రూ.30తో ప్రారంభించి... నేడు రూ.12 వేల కోట్ల‌కు అధిప‌తి... రాజేంద‌ర్ గుప్తా స‌క్సెస్ జ‌ర్నీ..!

ఒక ఐడియా అత‌ని జీవితాన్నే మార్చేసింది. అప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం చిన్న‌చిన్న వ్యాపారాలు చేస్తూ బ‌తుకుబండిని లాగిస్తున్న రాజేంద‌ర్ గుప్త‌.. ఒక్క‌సారిగా రిస్క్ తీసుకోవాల‌నుకున్నాడు. అది కూడా చాలా పెద్ద రిస్క్‌. ఆ రిస్క్ ఫెయిల్ అయితే అత‌ని జీవితం అక్క‌డితో ముగిసిన‌ట్లే.
Rajinder Gupta
Rajinder Gupta

కానీ, నాడు ఆయ‌న ఆ నిర్ణ‌యం తీసుకోక‌పోయింటే నేడు రూ. 12 వేల కోట్ల‌కు అధిప‌తి అయ్యేవాడు కాదు. రాజేంద‌ర్ గుప్తా స‌క్సెస్ జ‌ర్నీ మీకోసం... 

రాజిందర్ గుప్తా పంజాబ్ రాష్ట్రంలోని బటిండాలో 1959 జ‌న‌వ‌రి 2న నోహర్ చంద్ గుప్తా, మాయావతి దంపతులకు జన్మించాడు. రాజింద‌ర్ తండ్రి అప్ప‌టికే వ‌స్త్ర వ్యాపారం చేసేవారు. త‌న 14 ఏళ్ల వ‌య‌సులో 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న రాజింద‌ర్ స‌డెన్‌గా చ‌దువుమానేయాల్సి వ‌చ్చింది. 

Record Breaking Salary: అత్య‌ధిక వేత‌నంతో అద‌ర‌గొట్టిన షాప్ కీప‌ర్ కొడుకు... కోట్ల ప్యాకేజీల‌తో ఆద‌ర్శంగా నిలుస్తున్న కుర్రాళ్లు

ఆర్థిక క‌ష్టాల‌తో కొవ్వొత్తులు, చిన్న చిన్న సిమెంట్ పైపులు త‌యారు చేసి వాటిని విక్ర‌యించ‌డం ప్రారంభించారు. అలా రోజుకు రూ.30 సంపాదించ‌డం మొద‌లు పెట్టాడు. రాజింద‌ర్ ర‌క్తంలో వ్యాపారం మిళిత‌మై ఉండ‌డంతో ఆయ‌న త‌న ఆలోచ‌న‌ల‌నే పెట్టుబ‌డిగా పెట్టారు. 

rajinder gupta

కేంద్ర ప్రభుత్వంలోని తన మిత్రుల ద్వారా ఎరువుల తయారీ కర్మాగారానికి సంబంధించిన లైసెన్సును సంపాదించాడు. ఆ ఫ్యాక్ట‌రీ నిర్మాణానికి సుమారు రూ.6.5 కోట్ల పెట్టుబడిని పెట్టారు. అప్ప‌ట్లో ఇది చాలా పెద్ద మొత్తం. అలా అభిషేక్ ఇండస్ట్రీస్ పేరుతో ఎరువుల తయారీ మొద‌లు పెట్టారు.

Vijai Subramaniam Success Story: క్రెడిట్ కార్డు ఏజంట్ నుంచి 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిప‌తి... విజయ్ సుబ్రమణియమ్ స‌క్సెస్ జ‌ర్నీ

ఆ స‌మ‌యంలో పంజాబ్ నిత్యం క‌ళ్లోళితంగా ఉండేది. అల్ల‌ర్ల‌ను అదుపులో చేయ‌డానికి 1990లో రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టారు. ఆ స‌మ‌యంలో ఇత‌ర పారిశ్రామిక వేత్త‌లంతా రాష్ట్రాన్ని వీడి ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లి.. అక్క‌డ త‌మ బిజినెస్‌ల‌ను విస్త‌రించారు. కానీ, రాజింద‌ర్ త‌న పుట్టిన రాష్ట్రాన్ని వ‌దిలి వెళ్ల‌డానికి అస్స‌లు ఇష్ట‌ప‌డ‌లేదు. 

ఆ స‌మ‌యంలో వ‌చ్చిన వ‌చ్చిన అవ‌కాశాల‌ను అందిపుచ్చుకున్నారు. బిజినెస్‌ను రెట్టింపు చేయ‌డంతో పాటు ఇత‌ర రంగాల‌కు విస్త‌రించారు. టెక్స్‌టైల్స్‌, పేపర్ మాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్స్, పవర్ రంగాలకు త‌న వ్యాపారాన్ని విస్త‌రించి దానికి ట్రైడెంట్ గ్రూప్‌గా మార్చారు. 

Rajinder Gupta

పంజాబ్ లోని లుధియానా కేంద్రంగా ఉన్న ట్రైడెంట్ గ్రూప్ అంచ‌నాల‌కు మించి వృద్ధి సాధించింది. 1990 నుంచి ఆయ‌న వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం రాలేదు. నేడు టెక్స్‌టైల్స్‌, స్పిన్నింగ్ రంగంలో ఆయ‌న‌దే అగ్ర‌స్థానం. ప్ర‌స్తుతం ఆయ‌న సంప‌ద విలువ రూ.12,700 కోట్లు. 

Kanhaiya Sharma Success Story: 2.5 కోట్ల వేత‌నాన్ని వ‌దిలేసి... సొంతంగా స్టార్ట‌ప్ స్థాపించి... 23 ఏళ్ల‌కే కోట్ల‌కు అధిప‌తి అయిన క‌న్హ‌య్య శ‌ర్మ స‌క్సెస్ జ‌ర్నీ

పేప‌ర్ త‌యారీకి అప్ప‌టివ‌ర‌కు చెట్ల‌ను విరివిగా న‌రికేవారు. ప‌ర్యావ‌ర‌ణానికి ఇది పెద్ద దెబ్బ‌. భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌లెత్త‌కుండా ఆయ‌న స‌రికొత్త‌గా ఆలోచించారు. పంజాబ్‌లో గోధ‌మ పంట‌ను విరివిగా పండిస్తారు. ఆ పంట వ్య‌ర్థాల నుంచి పేప‌ర్‌ను త‌యారు చేయ‌డం ప్రారంభించారు. ఇండియాలో అతిపెద్ద నూలు స్పిన్నర్లలో రాజింద‌ర్ ఒక‌రు. 

Rajinder Gupta

వాణిజ్య‌, వ్యాపార రంగంలో రాజింద‌ర్ మూడు ద‌శాబ్దాల అనుభ‌వం గ‌డించారు. పారిశ్రామిక అభివృద్ధికి ఆయ‌న చేసిన సేవ‌ల‌కు భార‌త ప్ర‌భుత్వం ప‌ద్మ‌శ్రీ అవార్డుతో స‌త్క‌రించింది. కేబినెట్ మంత్రి హోదాలో పంజాబ్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ (పీఎస్పీబీ) వైస్ చైర్మన్‌గా సేవ‌లు అందిస్తున్నారు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సలహా మండలి చైర్మన్‌గా ఆయ‌న సేవ‌లందించారు. 

Ananth Narayanan success story: మింత్రా సీఈఓ ప‌ద‌విని వ‌దిలేసి... ఆరు నెలల్లోనే 10 వేల‌ కోట్ల బిజినెస్‌ను స్థాపించిన అనంత్ స‌క్సెస్ జ‌ర్నీ

రాజేంద‌ర్ గుప్తా, మ‌ధు గుప్తా దంప‌తులకు కూతురు, కొడుకు. కూతురు నేహా గుప్తా లండన్ లోని కాస్ బిజినెస్ స్కూల్ నుంచి ఫైనాన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. కుమారుడు అభిషేక్ గుప్తా అదే సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆలోచ‌న‌లతో పాటు రిస్క్‌ను పెట్టుబ‌డిగా పెట్టి వేల కోట్ల‌కు అధిప‌తి అయిన రాజింద‌ర్ గుప్తా ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

Published date : 13 Jun 2023 06:42PM

Photo Stories