Skip to main content

Vijai Subramaniam Success Story: క్రెడిట్ కార్డు ఏజంట్ నుంచి 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిప‌తి... విజయ్ సుబ్రమణియమ్ స‌క్సెస్ జ‌ర్నీ

ఇది వరకు మనం చాలా సక్సెస్ స్టోరీలను గురించి తెలుసుకున్నాము. ఇందులో కొంత మంది డబ్బున్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి సక్సెస్ కొట్టిన వారు ఉన్నారు. అయితే ఇప్పుడు పేదరికం నుంచి వచ్చి రూ. 1000 కోట్లు సామ్రాజ్యం సృష్టించిన 'విజయ్ సుబ్రమణియమ్' గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
Vijai Subramaniam
Vijai Subramaniam

ఈ రోజు 'రాయల్ ఓక్' (Royal Oak) ఫర్నిచర్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు, కానీ దాన్ని స్థాపించిన విజయ్ గురించి మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే సుమారు ఇరవై సంవత్సరాలు కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులో ఒక ప్రభుత్వ కళాశాలలో బీకామ్‌ చేశారు. కుటుంబాన్ని పోషిచే ఒకే వ్యక్తి విజయ్ కావడంతో మాస్టర్ డిగ్రీ చేయలేకపోయాడు.

చ‌ద‌వండి: 2.5 కోట్ల వేత‌నాన్ని వ‌దిలేసి... సొంతంగా స్టార్ట‌ప్ స్థాపించి... 23 ఏళ్ల‌కే కోట్ల‌కు అధిప‌తి అయిన క‌న్హ‌య్య శ‌ర్మ స‌క్సెస్ జ‌ర్నీ

vijay

బీకామ్ పూర్తయిన తరువాత సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని వారి బంధులలోనే ఒకరు తనని మోసం చేసారని ఒక సందర్భంలో వెల్లడించారు. ఆ తరువాత కేరళలోని మున్నార్‌కు వెళ్లి అక్కడ క్రెడిట్ కార్డు ఏజెంట్‌గా పని చేయడం ప్రారంభించాడు. ఆ తరువాత 1997లో చెన్నై వెళ్లి ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం ప్రారంభించి ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 10 రోజులలో రూ.2800 విలువైన వస్తువులను విక్రయించగలిగాడు.

Ananth Narayanan success story: మింత్రా సీఈఓ ప‌ద‌విని వ‌దిలేసి... ఆరు నెలల్లోనే 10 వేల‌ కోట్ల బిజినెస్‌ను స్థాపించిన అనంత్ స‌క్సెస్ జ‌ర్నీ

vijay

విజయ్ సుబ్రమణియమ్ 2001లో బెంగళూరులోని సఫీనా ప్లాజాలో స్టాల్‌ ప్రారంభించడం ఆయన జీవితానికి పెద్ద మలుపుగా మారింది. ఆ తరువాత బిగ్ బజార్ తమ అవుట్‌లెట్‌లో స్టోర్‌ను ఏర్పాటు చేయమని కోరింది. ఆ తరువాత కారు కొనుగోలు చేసి ఇల్లు కట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు.

vijay

విజయ్ సుబ్రమణియమ్ 2004లో మొదటి షాప్ ఓపెన్ చేసాడు. 2005 నాటికి చైనీస్ ఫర్నిచర్ దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. 2010 నాటికి మరొక షాప్ ఏర్పాటు చేసాడు. ఇదే రాయల్ ఓక్ ప్రారంభానికి నాంది పలికింది. ప్రస్తుతం ఈ సంస్థ కింద 150 స్టోర్లు ఉన్నాయి.

☛ Anubhav Dubey: ఐఏఎస్ కావాల‌నుకున్నాడు... ఇప్పుడు టీ అమ్ముతూ 150 కోట్లు సంపాదిస్తున్నాడు... 20 ఏళ్ల‌కే షుగ‌ర్ రావ‌డంతో

అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 280 కర్మాగారాల నుంచి తాను ఉత్పత్తులను పొందుతున్నట్లు తెలిపాడు. కాగా 2024 ఆర్థిక సంవత్సరంలో మరో 100 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎదగాలనే సంకల్పం ఉన్న వాడికి విజయం దాసోహమవుతుందని చెప్పడానికి ఇదో చక్కని నిదర్శనం.

Published date : 12 Jun 2023 06:04PM

Photo Stories