Semester Results: మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
సాక్షి ఎడ్యుకేషన్: కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ కళాశాల ఇటీవల నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ ఆనర్స్ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్కేయూ వీసీ డాక్టర్ హుస్సేన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేఎస్‌ఎన్ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదాను కల్పిస్తూ గత ఏడాది మే లో యూజీసీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.
PDSU: ‘హాల్ టికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నరు’
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం ద్వారా మేజర్, మైనర్ సబ్జెక్టులకు కళాశాల పరిధిలో గత డిసెంబరు, జనవరి నెలల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారన్నారు. మొత్తం 483 మంది విద్యార్థినులకు గాను 380 మంది ఉత్తీర్ణత సాధించినట్లుగా తెలిపారు.
PM-USHA Scheme: ఎస్కేయూకు 'పీఎం-ఉషా' నిధుల మంజూరుకు అనుమతి జారీ..!
బీఏ ఆనర్స్‌లో 48 శాతం, బీకాం ఆనర్స్‌లో 86.47 శాతం, బీఎస్సీ ఆనర్స్‌లో 86.80 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఫ్రిన్సిపాల్ డాక్టర్ పి.శంకరయ్య తెలిపారు. ఫలితాలను www. ksngdcwexams.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎస్.లక్ష్మీరంగయ్య, కళాశాల కంట్రోలర్ ఆప్ ఎగ్జామినేషన్ (సీఈ) డాక్టర్ శివశంకర్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ పర్వీన్‌భాను పాల్గొన్నారు.