PDSU: ‘హాల్ టికెట్ ఇవ్వకుండా వేధిస్తున్నరు’
Sakshi Education
కరీంనగర్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఫీజుల పేరిట వేధిస్తున్న జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని పీడీఎస్‌యూ జిల్లా నాయకులు బత్తుల రాజు, కట్కూరి ఎన్నోస్ కోరారు.
ఈ మేరకు ఫిబ్రవరి 22న డీఐఈవో జగన్మోహన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. వివిధ రకాల ఫీజులు అదనంగా వేస్తూ మొత్తం చెల్లిస్తేనే హాల్ టికెట్ ఇస్తామని విద్యార్థులు, తల్లిదండ్రులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వందలాది మంది విద్యార్థులు హాల్ టికెట్ కోసం కళాశాలల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
పరీక్షల సమయంలో ఇలా చేస్తుండటంతో తాము బాగా రాయలేమని వారు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. వెంటనే ఆయా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలపై చర్య తీసుకోవాలని విన్నవించారు.
Published date : 23 Feb 2024 01:37PM