PM-USHA Scheme: ఎస్కేయూకు 'పీఎం-ఉషా' నిధుల మంజూరుకు అనుమతి జారీ..!
సాక్షి ఎడ్యుకేషన్: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. నాణ్యమైన పరిశోధనలు, అధునాతన భవనాల నిర్మాణానికి వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దన్నుగా నిలుస్తున్నాయి. తాజాగా ప్రధాన మంత్రి ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (పీఎం – ఉష) పథకం కింద రూ. 20 కోట్ల నిధులు విడుదలకు ఆమోదం దక్కింది. ఈ మేరకు ఎస్కేయూతో పాటు రాష్ట్రంలోని మరో మూడు వర్సిటీలకు పీఎం – ఉష నిధులు మంజూరుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి అనుమతులు జారీ చేసింది.
Stress Management: స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ
మౌలిక సదుపాయాల కల్పనకు దోహదం
రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్ (రూసా) పథకాన్ని 2013లో ప్రారంభించగా, రెండో దశ కింద 2018లో పునరుద్ధరించారు. ప్రస్తుతం నూతన జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి రూసా పథకంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేసి పీఎం– ఉష పేరుతో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పథకం కింద మంజూరైన నిధులను ఉన్నత విద్యలో నాణ్యత ప్రమాణాలు పెంపొందించడం, ఉన్నత విద్యలో అడ్మిషన్ల పెంపుదల, నాణ్యమైన పరిశోధనలు, వర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం వంటి అంశాలకు వెచ్చించాల్సి ఉంది.
Inter Admissions: సీఓఈ సెకండ్ స్క్రీనింగ్ టెస్ట్ తేదీ ఇదే..
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి గతంలో రూ.20 కోట్ల నిధులు విడుదల కాగా, వీటి వ్యయానికి సంబంధించిన వినియోగిత పత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్స్)ను సమర్పించారు. దీంతో తాజాగా రూ.20 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 17న అంగీకారం తెలిపాయి. ఈ నిధులతో వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమమైంది.
M Abhishikth Kishore: ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి క్యూఆర్ సాంకేతికత
భువన విజయానికి నూతన శోభ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఆడిటోరియం (భువన విజయం)కు నూతన శోభ రానుంది. భువన విజయం ఆధునీకరణ, పరీక్షల భవనానికి కంప్యూటర్లు, యూనివర్సిటీ శబరి అతిథి గృహం మరమ్మతులకు కలిపి రూ. 4 కోట్లు వెచ్చించేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నూతన కేంద్ర పరిశోధన సంస్థ భవనం, ఇందులో మొదటి అంతస్తులో పోటీ పరీక్షల కేంద్రానికి కేటాయించారు.
Intermediate Board Exams: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం..!
లాన్, విన్ సర్వర్ రూం కలిపి రూ. 5.75 కోట్లు, అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబిరేషన్, ఎంఓయూ విత్ ఇండస్ట్రీ, అల్యూమ్ని కనెక్ట్ పోర్టల్, యూజీసీ నిబంధనల మేరకు పరిశ్రమల అభివృద్ధి కేంద్రం, ఆన్‌లైన్ పోర్టల్ ఫర్ స్టూడెంట్ కేంద్రానికి రూ.8.50 కోట్లు మొత్తం రూ.20 కోట్లు వెచ్చించనున్నారు.
Students Talent: విద్యార్థుల ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి..!
ఉన్నత విద్యామండలికి ధన్యవాదాలు
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వీసీగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే రూ. 20 కోట్ల నిధులు మంజూరుకు అంగీకారం తెలపడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో నాలుగు వర్సిటీల్లో ఒకటిగా ఎస్కేయూను గుర్తించి పీఎం– ఉష పథకానికి ఎంపిక చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ కె.హేమచంద్రారెడ్డి, పీఎం– ఉష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పోలా భాస్కర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు, నూతన పరిశోధన కేంద్రం నిర్మాణానికి నిధులు వెచ్చించనున్నాం.
– ప్రొఫెసర్ కె.హుస్సేన్‌రెడ్డి, వీసీ, ఎస్కేయూ