Students Talent: విద్యార్థుల ప్రతిభకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉండాలి..!
సాక్షి ఎడ్యుకేషన్: విద్యార్థుల అభిరుచులకు అనుగుణంగా తల్లిదండ్రులే వారిని ప్రోత్సహించాలని డీఈవో రవీందర్‌రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని జేవీఎన్‌ఆర్ పాఠశాలలో క్రీడాదినోత్సవం గురువారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈవో హాజరై మాట్లాడారు. విద్యార్థుల మనసిక, శారీరక మానసిక వికాసంలో తల్లిదండ్రులపాత్ర కీలకమని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న అభిరుచులను, అంతర్గత నైపుణ్యాలకు గుర్తించి తదనుగుణంగా వారిని తీర్చిదిద్దాలని సూచించారు.
Mallu Bhatti Vikramarka: ‘ఇంటర్నేషనల్’ గురుకుల భవనాలు!
చిన్నారులు తమ ప్రతిభను ప్రదర్శించినప్పుడు కుటుంబ సభ్యులు ఇచ్చే చిన్నప్రశంస వారిలో అంతర్గతంగా ఉత్తేజం నింపుతుందన్నారు. చిన్నారులు మన కుటుంబ గౌరవాన్ని సమాజంలోకి తీసుకెళ్లే ప్రతినిధులుగా తయారుచేయాలన్నారు. నేటి పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపారు. విద్యార్థుల్లో ఈ నైపుణ్యాలను పెంపొందించాలని కోరారు. ఒత్తిడిని జయించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు.
Motivation to Students: విద్యార్థులు కృషి పట్టుదలతో చదవాలి..
అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జేవీఎన్‌ఆర్ పాఠశాల ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ కె.శ్యాంసుందర్, సెక్రెటరీ వనం సురేందర్, కోశాధికారి మంజీత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ మణికుమారి, సిబ్బంది పాల్గొన్నారు.