Motivation to Students: విద్యార్థులు కృషి పట్టుదలతో చదవాలి..
సాక్షి ఎడ్యుకేషన్: మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి అన్నారు. ఇందుకు తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లాపరిషత్, ఆదర్శపాఠశాలలో నిర్వహించిన వార్షికోత్సవం, 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
School Inspection: పాఠశాలలో తనిఖీలు చేసిన పరిశీలకులు
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయులు చదువుతోపాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పదోతరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచి జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. కృషి, పట్టుదలతో బాగా చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షించాయి.
Open Book Exams: గుడ్ న్యూస్.. ఇక పుస్తకాలు చూస్తూనే పరీక్షలు రాయవచ్చు!!
కార్యక్రంమలో ఎంఈఓ శ్రీనివాసులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి,ప్రముఖ న్యాయవాది ప్రభాకర్ రెడ్డి, నాయకుడు వివి ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ రామచంద్ర, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసరాజు, ఎంఈఓ శ్రీనివాసులు, సాయి ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ సుధాకర్ రెడ్డి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బుజ్జి రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ శివప్రకాష్ రెడ్డి
Tags
- school annual day
- farewell party
- Tenth Students
- examinations
- Board Exams
- district education minister
- Shiva Prakash reddy
- motivational words for students
- students education
- Principal
- Teachers
- studies for students
- Class 10 public examinations preparation
- student achievement
- Teachers' efforts
- SakshiEducationUpdates