Skip to main content

School Inspection: పాఠశాలలో తనిఖీలు చేసిన పరిశీలకులు

విద్యాశాఖ పరిశీలక బృందం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తనఖీలు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు అందుతున్న బోధన, అక్కడి వసతులును కూడా తనిఖీలు చేసి పాఠశాల అధికారులకు పలు సూచనలు ఇచ్చారు..
State Inspection Team inspecting the education of students in school  Inspection team discussing with school authorities

సాక్షి ఎడ్యకేషన్‌: లర్నింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (అభ్యసనాభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా విద్యాశాఖ రాష్ట్ర పరిశీలక బృందం సభ్యులు ఎం. వసంత (సోషల్‌ పరిశీలకులు), ఈడీ మధుసూదన్‌ రెడ్డి (సైన్స్‌ పరిశీలకులు), రహంతుల్లా (ఇంగ్లీషు పరిశీలకులు) గురువారం నందలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.

Mini Job Mela: పాలిటెక్నిక్‌ కళాశాలలో మినీ జాబ్‌ మేళా..

వీరు 6,7,8వ తరగతుల విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలు, ఉపాధ్యాయుల బోధనా అంశాలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశీలకులు మాట్లాడుతూ తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థుల కోసం ఉపాధ్యాయులు చేపట్టాల్సిన బోధన, కార్యాచరణ ప్రణాళిక గురించి రివ్యూ మీటింగ్‌లో వివరించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

Singareni Job Notification: సింగరేణిలో 272 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

ఈ కార్యక్రమంలో అన్న మయ్య జిల్లా సమగ్ర శిక్ష అభియాన్‌ ఏఎంఓస్‌ రామకృష్ణ, నందలూరు ఎంఈఓ–1 ఎల్‌ నాగయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, అసిస్టెంట్‌ హెచ్‌ఎం రౌప్‌ బాష, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Published date : 23 Feb 2024 01:25PM

Photo Stories