Mini Job Mela: పాలిటెక్నిక్ కళాశాలలో మినీ జాబ్ మేళా..
Sakshi Education
నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ అవకాశం ఈ మినీ జాబ్ మేళాతో కల్పిస్తున్నారు. సంస్థ జిల్లా అధికారి, కళాశాల ప్రిన్సిపల్ ప్రకటనలో వివరాలను తెలిపారు..

సాక్షి ఎడ్యుకేషన్: రాయచోటి పాలిటెక్నికల్ కళాశాలలో ఈ నెల 24వ తేదీ శనివారం మినీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ, కళాశాల ప్రిన్సిపల్ శివశంకర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18–24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న మహిళలు, పురుషులు హాజరు కావచ్చుని తెలిపారు.
Month of Exams: మార్చి నెల మొత్తం పరీక్షల కాలం..!
మేళాకు హాజరయ్యే వారు తమ అర్హత పత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 9550104260, 8897776368 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.
Published date : 23 Feb 2024 11:15AM