Skip to main content

Medical Jobs: 108 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం!

గుంటూరు మెడికల్‌: అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ 108 అంబులెన్సులో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌గా (ఈఎంటీ) పనిచేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు 108 జిల్లా మేనేజర్‌ జి.నాగదీప్‌ తెలిపారు.
Medical Jobs: 108 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం Aurobindo Emergency Medical Services recruitment notice for EMT position Guntur Medical Services hiring EMTs for 108 Ambulance service  108 Ambulance EMT job openings announcement by District Manager G. Nagadeep

అర్హతలు మరియు నియామక ప్రక్రియ
బీఎస్సీ బయాలజీ, బి.జడ్‌సీ, బీఎస్సీ నర్సింగ్‌, బయోకెమిస్ట్రి, మైక్రోబయాలజీ, బీఫార్మసీ చదివి 35 సంవత్సరాల్లోపు వయస్సు ఉన్నవారు అర్హులన్నారు.

పనిచేయాల్సిన ప్రాంతాలు
మంగళగిరి, తుళ్లూరు, కాకుమాను, వట్టిచెరుకూరు, కొల్లిపర, తాడేపల్లి, తెనాలి, తాడికొండ లలో ఉద్యోగాలకు ఎంపికై వారు పనిచేయాల్సి ఉంటుందన్నారు.

బయోడేటా అందజేత
అభ్యర్థులు తమ బయోడేటాను గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయం రెండో ఫ్లోర్‌లోని 108 ఆఫీసులో అందజేయాలన్నారు.

వివరాలకు 91218 92889 నంబరులో సంప్రదించాలన్నారు.

 

Published date : 25 Jul 2024 12:31PM

Photo Stories