Skip to main content

M Abhishikth Kishore: ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి క్యూఆర్‌ సాంకేతికత

రాయచోటి: పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడం కోసం పటిష్టమైన క్యూఆర్‌ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
QR technology to prevent leakage of question papers  QR technology     Prevention of leakage

పదోతరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యల ద్వారా అత్యంత పటిష్టవంతంగా నిర్వహించడం జరుగుతోందని కలెక్టర్‌ తెలిపారు. ప్రశ్నపత్రాల సీల్డ్‌ కవర్లను తెరిచేటప్పుడు సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం, పరీక్ష కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం, ప్లయింగ్‌ స్క్వాడ్‌ వంటి అనేక చర్యల ద్వారా పరీక్షలను పటిష్టంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | ట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

ఈ సంవత్సరం పదోతరగతి పరీక్షలకు ముద్రించే ప్రశ్నపత్రంలో క్యూఆర్‌ కోడ్‌ ముద్రించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పరీక్ష రాయబోయే ప్రతి విద్యార్థికి ఇవ్వనున్న ప్రశ్నపత్రంలో క్యూఆర్‌ కోడ్‌ వేర్వేరుగా ఉంటుందన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగి, ప్రశ్నపత్రం లీకేజీ అయితే అది ఏ విద్యార్థి దగ్గర నుంచి లీక్‌ అయ్యిందో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఎవరూ ప్రశ్నాపత్రం లీకేజీకి పాల్పడవద్దని సూచించారు.
 

Published date : 23 Feb 2024 01:19PM

Photo Stories