Adv.Supplementary Examinations2024: ఇంటర్మీడియెట్, పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నాహాలు
ఏలూరు : జిల్లాలో ఇంటర్మీడియెట్, పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను పక్కా గా నిర్వహించాలని డీఆ ర్వో డి.పుష్పమణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి వచ్చేనెల 1 వరకు జరుగుతాయని, ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 12,797 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఫస్టియర్ విద్యార్థులు 8,664 మంది, సెకండియర్ విద్యార్థులు 4,133 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. జూన్ 6న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 7న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను 124 కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు.
Also Read : IGNOU Admissions 2024
టెన్త్‌లో 11,533 మంది..
పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి వచ్చేనెల 3 వరకు నిర్వహిస్తారని డీఆర్వో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, 11,533 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. వీరిలో బాలురు 6,970 మంది, బాలికలు 4,563 మంది ఉన్నారని, జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, విద్యార్థులు గంట ముందుగా కేంద్రాలకు చేరు కోవాలని అన్నారు.
కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు
పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని డీఆర్వో పుష్పమణి అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సంబంధిత మండల విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసి ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా సమయాలకు అనుగుణంగా కేంద్రాల వద్దకు బస్సులు నడపాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను వెంటనే ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కేంద్రాలకు సమీపంలోని కంప్యూటర్ సెంటర్లు, జెరాక్స్ షాపులను మూసివేయించాల న్నారు. డీవీఈఓ, కన్వీనర్ డీఈసీ బి.ప్రభాకరరా వు, డీఈఓ అబ్రహం, ఎంహెచ్‌ఓ మాలతి, పోలీసు, విద్యుత్, మెడికల్ అధికారులు, ఆర్‌టీసీ, పోస్టల్, హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.