School Education: విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రులకు అవగాహన
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధిని వివరించనున్నారు. ఈ మేరకు మే 31న పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో 2024–25 విద్యా సంవత్సరం నుంచి ‘ఉపాధ్యాయులు–తల్లిదండ్రుల గృహ సందర్శన కార్యక్రమం’ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 1 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంపొందించడం కోసం ఈ విధానం అమలు చేస్తున్నట్లు వివరించారు.
చదవండి: Private schools: ప్రైవేట్ స్కూళ్లకు ఝలక్.. బుక్స్, యూనిఫాంలు అమ్మడానికి వీల్లేదు
విద్యార్థులు ఉన్నతమైన ప్రగతి సాధించాలంటే ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల సహకారం కూడా అవసరమని, విద్యలో తల్లిదండ్రుల ప్రమేయం విద్యాపరమైన ఫలితాలను గణనీయంగా పెంచుతుందన్నారు. తరగతి ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి ఇంటిని విద్యా సంవత్సరంలో రెండు సార్లు (జూన్, జనవరి) సందర్శించాలని సూచించారు. ఈ సందర్భంగా పిల్లల చదువు తీరు, విద్యా ఫలితాలను తల్లిదండ్రులకు వివరించాలన్నారు.