Skip to main content

AP Tenth Class Supplementary Hall Ticket 2024 : ఏపీలో టెన్త్‌ సప్లిమెంటరీ పరీక్షలు 2024 హాల్‌టికెట్లు విడుద‌ల‌.. హాల్‌టికెట్లల‌ను డౌన్‌లోడ్ చేసుకోండిలా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి చేశారు. అలాగే పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన‌ హాల్‌టికెట్ల‌ను కూడా విడుద‌ల చేశారు.
10th Class Supplementary Exams in Andhra Pradesh  Arrangements Complete for 10th class supplymentry exams  AP Tenth Class Supplementary Hall Ticket 2024  Hall Tickets Released for 10th Class Advanced Supplementary Exams

ఈ ప‌రీక్ష‌లు మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వ‌హింనున్నారు. ఈ పరీక్షలకు 1,61,877 మంది హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి వెల్లడించారు. వారి­లో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు­న్నా­రు. రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసా­మన్నారు.  ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండిలా..

ap ssc students news telugu

విద్యార్థులను ఉదయం 8.45 నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, తమ పేరు, పుట్టిన తేదీ వివరాలను సెలెక్ట్‌ చేసుకోవడం ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

☛ ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు-2024 హాల్‌టికెట్ల కోసం క్లిక్‌ చేయండి

☛ ప‌దో త‌ర‌గ‌తి ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి

ఏపీ ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ పరీక్షల తేదీలు ఇవే..
ఫస్ట్‌ లాంగ్వేజ్‌               24–05–24
సెకండ్‌ లాంగ్వేజ్‌         25–05–24
థర్డ్‌ లాంగ్వేజ్‌               27–05–24
మాథమెటిక్స్‌                28–05–24
ఫిజికల్‌ సైన్స్‌               29–05–24
బయోలాజికల్‌ సైన్స్‌    30–05–24
సోషల్‌ స్టడీస్‌                31–05–24
ఓఎస్‌ఎస్‌సీ పేపర్‌–1    01–06–24
ఓఎస్‌ఎస్‌సీ పేపర్‌–2    03–06–24 

Published date : 22 May 2024 10:22AM

Photo Stories